Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము చెప్పులు వాటి ప్రాముఖ్యత

చెప్పులు వాటి ప్రాముఖ్యత

PicsArt 08 12 02.08.29

చెప్పులు అంటే ఒకప్పుడు చాలా మందికి పెద్దగా పట్టింపు వుండేది కాదు. అసలు ఊళ్లలో అయితే చాలా మంది వేసుకునే వారు కూడా కాదు. కానీ, ఇప్పుడు కాలికి చెప్పు లేకుండా బయటకి వెళ్లటమే లేదు మనం! కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరుగుతూ వుంటారు. అలా అలవాటు ఏర్పడి పోయింది.


చెప్పులు కేవలం సౌకర్యం కోసమే కాక స్టైల్ కోసం వేసుకునే వారు కూడా ఇప్పుడు బోలెడు మంది. ముందులా నడుస్తున్నప్పుడు ఏదీ గుచ్చుకోకుండా వుండటానికి పాద రక్షలు వాడటం లేదు. కాలు కింద పెట్టకుండా కార్లలో తిరిగే వారు కూడా వేలకు వేలు పోసి శాండల్సు, స్లిప్పర్సు, బూట్లు కొనేస్తున్నారు. ఒక మనిషి వేసుకునే చెప్పులే అతడి రేంజ్ ఏంటో చెప్పేస్తున్నాయి!


చెప్పులు ఎంతో ముఖ్యమైపోయిన మాట నిజమే కానీ… చెప్పులు వందలాది రంగుల్లో షాపుల్లో దొరకటం కూడా మనం గమనిస్తూనే వున్నాం. చాలా మంది తాము వేసుకునే బట్టలకి మ్యాచయ్యే విధంగా చెప్పుల రంగులు ఎంచుకుంటూ వుంటారు. రెడ్ కలర్ మొదలు ఏ రంగూలేని ట్రాన్సపరెంట్ హీల్స్ వరకూ అన్నీ వాడేస్తుంటారు. అయితే, ఇలా రంగురంగుల చెప్పులు ధరించవచ్చా?


నిజానికి చెప్పులు ఏ రంగువి వేసుకున్నా తప్పేం లేదు. కానీ, కొన్ని రంగులు మాత్రం ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే, చెప్పులపై శని ప్రభావం వుంటుంది. కాబట్టి ఏవేవో రంగులు సెలెక్ట్ చేసుకోటం కన్నా పండితులు సూచిస్తున్న కలర్స్ ప్రయత్నిస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి! ఇక చెప్పులు కొన్నప్పుడు నిస్సంకోచంగా కొనదగిన రంగులు ఏవంటే… నలుపు, బ్రౌన్, బ్లూ, స్కై బ్లూ, గ్రే కలర్లు! ఇవి ఎంతో శ్రేష్ఠమైనవట!


నలుపు రంగు చెప్పులు వేసుకోవటం వల్ల దృష్టి దోషాలు వుండవంటున్నారు. అలాగే, బ్లూ కలర్ కూడా నెగటివ్ ఎనర్జీ దూరంగా వుంచుతుంది. కాబట్టి వీలైనంత వరకూ బ్లాక్, బ్రౌన్, బ్లూ, స్కై బ్లూ, గ్రే కలర్ల చెప్పులే కొనండి. లేదా ఇతర రంగుల చెప్పులున్నా… రెగ్యులర్ యూజ్ కి ఈ రంగు స్లిప్సర్స్ కొని పెట్టుకోండి. తద్వారా మీరు బయలుదేరే వెళ్లే పనుల్లో సత్వర ఫలితాలు, శుభ ఫలితాలు పొందండి!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad