Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము పిల్లలకు ఏ రకమైన మాస్క్‌లు వాడాలి?

పిల్లలకు ఏ రకమైన మాస్క్‌లు వాడాలి?

These Type Of Masks For Children

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సోకకుండా ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జనం మాస్కు లేకుండా బయటకు అడుగుపెట్టని పరిస్థితి ఏర్పడింది. ఇక పిల్లల విషయంలో వారు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే వారికి ఎలాంటి మాస్క్ పెట్టాలనే అంశంపై తల్లిదండ్రులు గాబరా పడుతున్నారు.

కాగా పిల్లలకు మూడు పొరల మాస్క్‌లు పెట్టడం మంచిది కాదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలకు మూడు పోరల మాస్క్ పెడితే వారికి ఆక్సీజన్ చాలా తక్కువగా అందుతుందని నిపుణులు వెల్లడించారు. చిన్న పిల్లలకు రెడీమేడ్ మాస్కుల కంటే కూడా ఇంట్లో తయారు చేసిన మాస్కులు వాడితే చాలా ఉత్తమం. ఒకవేళ మాస్కులు పెట్టుకోవడంలో పిల్లలు ఏదైనా ఇబ్బందికి గురైతే, వెంటనే ఆ మాస్కును తీసేసి, వేరే మాస్క్ లేదా చేతి రుమాలు వాడాలి.

ఇక పిల్లలకు మాస్క్ ఊడిపోకుండా, వాటిని వారు చేతులతో నలపకుండా ఉండే విధంగా వారికి ట్రెయినింగ్ ఇవ్వాలి. ఇలా చేస్తే మాస్క్‌కు అంటుకున్న దుమ్ము, ధూళి వారి చేతికి అంటుకోదు. ఏదేమైనా పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులు వారి మాస్క్‌ల విషయంలోనూ అంతే శ్రద్ధను తీసుకుని వారికి వదులుగా ఉండే మాస్క్‌లను ఇవ్వాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad