Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము నిద్ర పట్టడం లేదా?అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

నిద్ర పట్టడం లేదా?అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Trouble sleeping 1

ప్రస్తుత కాలంలో నిద్ర పోవడం అన్నది అతి పెద్ద సమస్యగా మారింది. పెరుగుతున్న నగరీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ గ్యాడ్జెట్స్ ప్రజలపై అధిక ప్రభావాన్ని చూపిస్తూన్నాయి. లాక్ డౌన్ తరువాత  టీవీ, మొబైల్ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఎక్కువగా ఖాళీ సమయం లభించడంతో చిన్న పెద్ద తేడాలేకుండా కుటుంబ సభ్యులు అందరు 24 గంటలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వినియోగిస్తేనే ఉంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటలకొద్దీ పనిచేయడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు.

సాధారణంగా ఓ వ్యక్తి రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కనీసం ఆరు గంటలు కూడా నిద్ర పోవడం లేదు. పెరుగుతున్న ఒత్తిడి, కంపెనీ టార్గెట్స్, ప్రజలపై అధిక భారాన్ని కలిగిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ప్రజలు నిద్రపోయే సమయాన్ని గణనీయంగా తగ్గించాయి. సరైన నిద్ర లేనట్లైతే బ్రెయిన్ మరియు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అందుకే వైద్యులు తప్పని సరిగా నిద్ర పోవాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేయవచ్చు. 

  • పెరుగన్నంతో భోజనం చేయడం ద్వారా వేగంగా నిద్రపడుతుంది. దీంతో పాటు మజ్జిగను తాగడం కూడా చాలా మంచిది. మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ ఎంజాయ్ నిద్రను ప్రేరేపిస్తుంది. 
  • భోజనం తర్వాత అరటిపండు తిన్నట్లయితే రక్తప్రసరణ సరిగ్గా జరిగి ఆందోళన తగ్గుతుంది. 
  • నిద్ర పోవడానికి కొన్ని నిమిషాల ముందు గోరువెచ్చని బాదం పాలు లేదా బాదం పప్పును ఆహారంగా తీసుకోవాలి. దీని వలన కండరాలపై ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతాయి .
  • నిద్ర పోవడానికి ముందు ఆల్కహాల్ లేదా సిగరెట్ కానీ తాగకూడదు. ఇది మెదడుపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. ఆల్కహాల్ మత్తును కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు ఎదుర్కోక తప్పదు. 
  • నిద్రపోయే సమయంలో కొంతమంది గ్రీన్ టీ తాగుతారు. ఇది కొంత వరకు మంచిదయినప్పటికీ మధుమేహం, హై బీపీ ఉన్నవాళ్లు వీటిని సేవించుకోవడం మంచిది. 
  • చెర్రీ పళ్ళు నిద్రలేమిని దూరం చేస్తాయి. చిన్నపిల్లలు చెర్రీ పండ్లను తినడానికి ఇష్టపడనట్లయితే వాళ్లకు జ్యూస్ ద్వారా అందించవచ్చు.
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad