Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము అతిగా వ్యాయామం చేస్తే అనర్ధాలు తప్పవు

అతిగా వ్యాయామం చేస్తే అనర్ధాలు తప్పవు

wait i thought cardio was good for me

సాధారణంగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే శృతి మించి ఏ పనైనా చేస్తే దానికి తగ్గట్టు దుష్ఫలితాలు కనబడతాయి. అందులోను వ్యాయామం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేగంగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో కావచ్చు లేక శరీర సౌష్టవాన్నిపెంచుకోవాలనే ఆత్రుతతో రోజుకి గంటల కొద్దీ వ్యాయామం చేస్తే శరీరంపై తీవ్రమైన ప్రభావం కలుగుతుంది. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలతో బాధపడే వారు వ్యాయామం చేయక పోవడమే మంచిది. అతిగా వ్యాయామం చేయడం వలన ఎముకులు శక్తిని కోల్పోయి పేలవంగా తయారవుతాయి. అందుకే వ్యాయామం చేసే వ్యక్తులు తప్పకుండా డైట్ ని ఫాలో కావలసి ఉంటుంది.

ఎముకల దృఢత్వం కోసం క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. స్త్రీలు అధికంగా వ్యాయామం చేయడం వల్ల రుతు చక్రం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అధిక వ్యాయామం కారణంగా స్త్రీలలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ స్థాయి పెరిగే కొద్దీ మహిళలు అసహనానికి గురవుతారు. ప్రతిదానికి చిరాకు, కోపం వస్తుంది. మహిళలు రోజుకి గరిష్టంగా 50 నిమిషాలకు మించి వర్కౌట్ చేయకూడదు. కొంతమంది ప్రతిరోజు 90 నిమిషాల పాటు వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇలా శృతి మించి ఎక్సైజ్ చేస్తే మానసిక సమస్యలు ఎదురవుతాయి. వ్యాయామం చేయాలంటే శరీరం ముందు సహకరించాల్సి ఉంటుంది.

అందుకే శరీరానికి కనీసం 8 గంటలు నిద్ర, తగినంత పోషకాహారం అందించాలి. ఈ రెండు లేకుండా వ్యాయామం చేస్తే తీవ్రమైన ఫలితాలు ఎదురవుతాయి. వారంలో ప్రతి రోజు వ్యాయామం చేయడం కూడా సరైన పద్ధతి కాదు. ప్రతీ వారం కేవలం ఐదు రోజులు మాత్రమే వర్కవుట్స్ చేయాలి. అప్పుడప్పుడు ద్యాన౦ వంటివి చేయడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. వ్యాయామం చేసే వ్యక్తిలో తప్పనిసరిగా పటిష్టమైన ఆహార ప్రణాళికను ఫాలో కావలసి ఉంటుంది. ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డి, పోషకాలు వంటివి డైట్ లో ఉండేలా జాగ్రత్త పడాలి. వీటివలన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad