
స్త్రీ,పురుషులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి అంశం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో వారు తమ జీవిత భాగస్వామితో శృంగారం విషయంలోనూ ఎలాంటి అవకతవకలు లేకుండా, అంతా సవ్యంగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే కొందరు మగవాళ్లు చేసే తప్పిదాలకు ఆడవారితో ఈ విషయంపట్ల తరుచూ గొడవలు జరుగుతుంటాయి. ఇక కొందరు అయితే ఇష్టం లేకుపోయినా, అసంతృప్తిగా శృంగారంలో పాల్గొంటుంటారు.
ముఖ్యంగా కొందరిలో ఉండే అలవాట్ల వల్లే తమ జీవితభాగస్వామికి ఈ విధమైన అయిష్టం, విభేధం వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు కలిసి కాసేపు సమయం గడపడమే గగనమైపోయింది. దొరికిన కొంత సమయాన్ని కూడా తమ పార్ట్నర్తో మనస్పూర్తిగా గడపలేకపోతున్నారు. ఇలాంటి వారు వీలైనంత వరకు ఒకే గదిలో ఉండకుండా, తమ భాగస్వామిని తీసుకుని ఇతర ప్రదేశాలకు వెళ్తే వారిలో మరింత ఉత్సాహం కలుగుతుందట.
ఇక మగవాళ్లు సిగరెట్ తాగుతూ కేవలం తమ ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. ఇక వీరు పడకగదిలోకి వచ్చే ముందు కూడా సిగరెట్ తాగి వస్తుండటంతో వారి భార్యల మూడ్ పూర్తిగా పోతుందట. అటు సిగరెట్లో ఉండే నికోటిన్ పధార్థం రక్త ప్రవాహ వ్యవస్థను దెబ్బతీస్తుందని, కాబట్టి ఈ అలవాటును కూడా వారు మానుకుంటే తమ పార్ట్నర్ శృంగారంలో మనస్పూర్తిగా పాల్గొంటారట. అటు చాలా మంది ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, ఇంటి వంటకాల్లో ఉప్పు ఎక్కువగా తినడం, మితిమీరి మద్యం సేవించడం వంటి అలవాట్ల వల్ల పడకసుఖం కోల్పోతున్నారట. ఈ అలవాట్లను మానుకుంటే వారు తమ భాగస్వామితో కలిసి రతిక్రీడను పూర్తిగా అస్వాదించగలరని నిపుణులు అంటున్నారు.