Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము తేనెతో రోగాలు మటాష్! రోగనిరోధక శక్తి పెంచుకుందాం రండి

తేనెతో రోగాలు మటాష్! రోగనిరోధక శక్తి పెంచుకుందాం రండి

gettyimages 183354852 1558479028

ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. ఎప్పుడు ఎవరికి సోకుతుందో వైద్యులకు కూడా అంతుపట్టడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరు తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అని సూచిస్తున్నారు. అయితే దీని కోసం ప్రత్యేకంగా మాత్రలను వినియోగించిన అవసరం లేదు. ప్రకృతి ప్రసాదించిన తేనెని తాగడం ద్వారా సమస్త రోగాలను పారద్రోలవచ్చు. తేనెలో ఉండే ఔషధ గుణాలు కరోనా పై పోరాడడానికి అవసరమైన శక్తినిస్తాయి. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపేస్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు.

శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే వారికి తేనె అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. గోరువెచ్చటి నీటిలో తేనె మరియు మిరియాల పొడి వేసి తాగినట్లయితే జలుబు నుండి బయటపడవచ్చు. తేనెను తీసుకోవడం ద్వారా మలబద్దక సమస్య అధిగమించవచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. అజీర్ణంతో బాధపడేవారు తేనెను తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.అయితే తేనెను నేరుగా కాకుండా వేడినీటిలో రెండు చెంచాలు వేసి తీసుకోవాలి. గొంతు నొప్పి, చిగుళ్ళ వాపు,పళ్ళ సమస్యలతో బాధపడే వారు కాఫీ,టీకు బదులుగా గ్రీన్ టీలో కొద్దిగా తేనె వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఎన్నో ఖనిజ లవణాలు ఉంటాయి.

కాలిన గాయాలకు తేనెను పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. దీనికి  సూక్ష్మజీవులను చంపే సామర్ధ్యం కలదు. ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్‌లు, టెర్పీన్లు, పాలీఫినాల్‌లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయి. ఆయాసం,దగ్గు, కఫంతో బాధపడేవారు వేడినీళ్లతో తేనెను కలిపి తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad