Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు ఎందుకు త్రాగాలి ?

వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు ఎందుకు త్రాగాలి ?

కాలం ఏదైనా కొబ్బరి నీళ్లు త్రాగడం సర్వసాదరణం.. అయితే ఏ కాలంలో కొబ్బరి నీళ్లు త్రాగిన, త్రాగకపోయిన వేసవి కాలంలో మాత్రం కొబ్బరి బొండం నుండి నేరుగా కొబ్బరి నీళ్ళు త్రాగడం మంచి అలవాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల ఉపశాంతే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొబ్బరి నీళ్ళలో విటమిన్లు, మినరల్సు, ఎమినో యాసిడ్లు, ఎలక్ట్రో లైట్స్, ఎంజైమ్ లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. అలాగే కొబ్బరి నీళ్ళలో ఆహార ఫైబరు, ఎంజైములు, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ సంపద కూడా పుష్కలంగా ఉంది. అంతేకాక ఇందులో క్లోరైడ్లు, కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ.

ఇంత అద్భుతమైన కొబ్బరి నీళ్ల ప్రయోజనాలను ఒక్కసారి పరిశీలిస్తే..

* ఈ కొబ్బరి నీళ్లలో వృద్ధాప్య నివారణకు, క్యాన్సర్ తగ్గించే కారకాలు, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకినినిన్లు పోష్కలంగా ఉన్నాయని అనేక పరిశోధనలు నిరూపించాయి.

* కొబ్బరి నీళ్లల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి కూడా అంతగానో ఉపయోగపడతాయి ఈ కొబ్బరి నీళ్లు.

* కొబ్బరి నీళ్ళలో సెలేనియం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వంటి కొన్ని మిశ్రమాలు ఉన్నాయి, ఇవి కాన్సర్ పైన పోరాటం చేస్తాయని అనేక ప్రయోగశాలల్లో రుజువైంది.

* ఈ నీటిలో ఉన్న ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్రపిండాలలోని రాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా అద్భుతంగా తగ్గిస్తుంది. అలాగే చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు, సేల్యులైట్, ముడతలు, తామర వంటి వాటిపై ఈ కొబ్బరి నీళ్ళను 2,3 వారాల పాటు రాస్తే చాలు మన చర్మం నిగానిగా మెరుస్తుంది.

* ఈ కొబ్బరి నీళ్ళు ఎలక్త్రోలైట్ పొటాషియం ఎక్కువగా కలిగిఉండడం వల్ల.. శరీర ద్రవాలలో ఎలక్త్రోలైట్ ని తిరిగి భర్తీచేస్తుంది. అలాగే కొబ్బరి నీళ్ళు తేమకోసం సిరల ద్వారా పంపే ద్రవంలా కూడా ఉపయోగపడతాయి.

* కొబ్బరి నీళ్ళలో కాటలేస్, ఆమ్ల ఫాస్ఫటేస్, డి-హైడ్రోజినేస్, పెరాక్సిడేస్, డయాస్టేస్, ఆర్ ఎన్ ఏ పాలిమేరాసేస్ లాంటి చాలా జీవ ఎంజైమ్‌లు వుంటాయి. ఇవి మనిషి అరుగుదలకు, జీవక్రియకు దోహదం చేస్తాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే కొబ్బరి నీళ్ళవల్ల మనిషి ఆరోగ్యానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ కాకపోయిన వారంలో 3, 4 రోజులైనా కొబ్బరి బొండం నీళ్లు త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad