Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము తులసితో ఆరోగ్యం మస్తు మస్తు: తులసి చేసే అద్భుతం!

తులసితో ఆరోగ్యం మస్తు మస్తు: తులసి చేసే అద్భుతం!

1296x728 Holy Basil

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని సాధారణంగా కృష్ణ పూజకు వినియోగిస్తుంటారు. తులసి ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అందుకే తులసి “మూలికల రాణి” అని పిలుస్తారు. తులసి ఆకులుతో దాదాపు 300 రకాల చికిత్సలు చేయవచ్చు. తులసి క్రిమిసంహారక లక్షణాలు ఉండటంతో దీనిని అనేక చర్మ సమస్యలకు వినియోగించవచ్చు. తులసి ఆకులను ద్రవంగా చేసి దాన్ని మొటిమలపై రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పేస్టు రూపంలో కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. దీని వలన మొటిమలు తగ్గుతాయి. తరచూ తులసి ఆకుల పేస్టు ని ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం యువ మరియు ప్రకాశవంతంగా ఉంటుంది.

జుట్టు రాలటం మరియు చుండ్రు సమస్యతో బాధపడే వారు కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా తులసి ఆకులను వినియోగించడం మంచిది. తులసి ఆకులను పేస్ట్ గా చేసి స్నానానికి ముందు దానిని తలకు అప్లై చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. తులసి ఆకుల పేస్ట్ ను తలకి అద్దడం ద్వారా ఆ ప్రాంతంలో రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. తరచూ జ్వరం మరియు సాధారణ జలుబుతో బాధ పడే వ్యక్తులు తులసి ఆకులను వేడి నీటిలో మరిగించి వాటిని తినడం ద్వారా వ్యాధుల నుండి బయటపడవచ్చు. తాజా తులసి ఆకులు అలవాటు మీ రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

తులసిలో వివిధ రసాయన సమ్మేళనాలు 20 శాతం వరకు శరీరంలోని ఇన్ఫెక్షన్-పోరాట ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది. ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad