Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము ఒక్కసారి నవ్వితే చాలు వందేళ్లు బ్రతికేయొచ్చు:లాఫింగ్ వల్ల కలిగే లాభాలు?

ఒక్కసారి నవ్వితే చాలు వందేళ్లు బ్రతికేయొచ్చు:లాఫింగ్ వల్ల కలిగే లాభాలు?

l pcA3TCykCb

ప్రస్తుత బిజీ లైఫ్ లో నవ్వటం అనేది అందరూ మర్చిపోయారు. ఉరుకుల పరుగుల జీవితం, తీవ్రమైన ఒత్తిళ్లు, జాబ్ టార్గెట్స్ వంటివి చిరునవ్వుని మన నుండి దూరం చేశాయి. ఆఫీస్ లో ఉండే పని ఒత్తిడి కారణంగా 24 గంటలు సీరియస్ గా ఉండటం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. నగరీకరణ జీవితంలో ఎవరైనా చిరునవ్వుతో పలకరించినా తిరిగి పలకరించే సమయం కూడా లేదు. ఈ పరిస్థితులన్నీ భావోద్వేగాలను మార్చివేసి క్రమంగా డిప్రెషన్ లోకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. వీటన్నిటికి చెక్ పెట్టే ఏకైక మార్గం “చిరునవ్వు”.  నవ్వడం ద్వారా ఒత్తిడి, ఆందోళన వంటివి  దూరం అవుతాయి. సాధారణంగా మనకు వచ్చే 70శాతం రోగాలు  ఒత్తిడి మూలంగానే వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, డయబెటీస్, రక్తపోటు, డిప్రెషన్‌, ఇన్సోమియా, మైగ్రేన్‌, ఆతృత వంటి తదితర వ్యాధులన్నీ ఒత్తిడి కారణంగానే వస్తాయి.

ఎప్పుడూ నలుగురితో నవ్వుతూ ఉండే వ్యక్తుల మానసిక పరిస్థితిని ఒంటరిగా నిరాశలో ఉండే వ్యక్తుల మానసిక పరిస్థితి ఒక్కసారి గమనించండి. నవ్వుతూ ఉండే వాళ్ళు ఎప్పుడు ఎనర్జిటిక్ గా సంతోషంగా ఉంటారు. ఒంటరిగా ఉన్న వాళ్ళు నిరాశ, నిస్పృహలతో దుఃఖిస్తూ ఉంటారు. దీని వలన గుండె మరియు మెదడుకు సంబంధించిన వ్యాధులు సోకవచ్చు. ముఖ్యంగా బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ. నిత్యం నవ్వుతూ ఉండే వాళ్లలో  హార్మోన్ శ్రావకాలు తక్కువ సంఖ్యలో విడుదలవుతాయి. నవ్వుతున్న సమయంలో లింపాజైట్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఫలితంగా ఆర్థరైటిస్‌, స్పాండలైటిస్‌, మైగ్రేన్‌ లాంటి వ్యాధులు దరిచేరవు.

నవ్వుతున్నా వ్యక్తుల్లో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు. నోరు పెద్దగా చేసుకొని నవ్వడం, కళ్ల కింద ముడతలు ఉన్న వ్యక్తులు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఎన్నడూ నవ్వని ఆటగాళ్లు సరాసరిన 72.9 ఏళ్లు అప్పుడప్పుడూ మాత్రమే నవ్విన వాళ్లు 75 ఏళ్లు, బిగ్గరగా నవ్వేవాళ్లు 79.9 ఏళ్లు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. మొహమాటం కోసం ఉత్తుత్తి నవ్వులు చిందించేవారు ఆయుష్షులో ఎలాంటి మార్పులేదట. బిగ్గరగా నవ్వే వారి ముఖంపై ఉండే కండరాలు సంకోచ, వ్యాకోచం చెంది కాంతివంతమైన వర్ఛస్సుతో ఉంటారు..

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad