Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము వారం రోజుల్లో 7 కిలోలు బరువు తగ్గండి: సూపర్ టిప్

వారం రోజుల్లో 7 కిలోలు బరువు తగ్గండి: సూపర్ టిప్

AdobeStock 164981310

త్వరితగతిన బరువు తగ్గడం అన్నది చాలామంది కల. అసలు బరువు తగ్గడం అదే అత్యంత కష్టమైన పని. కొంతమంది గంటలకు గంటలు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఉంటే మరి కొంతమంది కఠినమైన డైట్‌ పాటిస్తూ ఎంతో కాలం శ్రమిస్తూ౦టారు. అయినా సరే వాళ్లు అనుకున్న ఫలితాలు కొన్నిసార్లు రాకపోగా దుష్ప్రభావాలు కూడా ఏర్పడతాయి. అయితే తక్కువ కాలంలో వేగంగా బరువు తగ్గే ఓ చిట్కా ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది. ఈ చిట్కా ద్వారా నెలల్లో వెయిట్ లాస్ కావడం కాదు కేవలం వారం రోజుల్లోనే 7 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. ఇందుకోసం జీఎమ్ ఏడు రోజుల డైట్‌ను ఫాలో అవ్వాలి. జీఎమ్ అంటే జనరల్‌ మోటర్స్.

ప్రముఖ ఎలక్ట్రానిక్ మోటార్స్ కంపెనీ అయినా జనరల్ మోటార్స్ కార్పొరేషన్ తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండడం కోసం ఓ నియమాన్ని ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ ఆహార నియమం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. దీని ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నాయి౦టు ఇప్పటికే వేల మంది ట్వీట్లు చేస్తున్నారు. అసలు అ డైట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

మొదటి రోజు డైట్:

వారం రోజుల డైట్ లో అధికంగా పండ్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నారింజ, యాపిల్, పుచ్చకాయ, బేబీ కార్న్‌ వంటి తాజా పండ్లను తీసుకోవాలి. అయితే సపోటా,కివీ, సీతాఫలం, ద్రాక్షను వంటి వాటిని తీసుకోకూడదు. మొదటి రోజు ఆరు నుండి ఎనిమిది లీటర్ల జ్యూసును తీసుకోవాలి. కేవలం పళ్ల రసాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా మరే ఇతర ఆహార పదార్థాలను తీసుకోకూడదు. 

రెండో రోజు డైట్:

రెండో రోజు డైట్లో పండ్లను కాకుండా కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం ఆకుకూరలు మాత్రమే తీసుకోవాలి. ఉదయం పూట చిలకడ దుంపను కచ్చితంగా తీసుకోవాలి. దీనికంటూ పరిమితి లేదు ఎంతైనా తీసుకోవచ్చు. 

మూడో రోజు డైట్: 

మూడో రోజు మొదటి రెండు రోజులు తీసుకున్న ఆహారాన్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు రోజులుగా శరీరం సరైన ఆహారం అందక చాలా ఆకలిగా ఉంటుంది అటువంటి సమయంలో ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.

నాలుగో రోజు డైట్:

నాలుగో రోజు ఎటువంటి ఫలాలు మరియు ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కేవలం ద్రవపదార్థాలైన 3 గ్లాసుల పాలు మరియు ఎనిమిది అరటిపండ్లును మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 

ఐదో రోజు డైట్:

ఇప్పటివరకు మితంగా తీసుకున్న ఆహారాన్ని ఈరోజు కొంచెం గరిష్ట స్థాయికి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. 5వ రోజు ఒక పూట అర కిలో చికెన్, మరో పూట 6 టమోటాలను భోజనంగా తీసుకోవాలి.

ఆరోవ రోజు డైట్:

ఇక ఈ ఆరోవ రోజు బ్రౌన్ రైస్ మరియు వెజిటేబుల్స్ మరో అర కిలో చికెన్ తీసుకోవాలి. అయితే క్రితం తీసుకున్న టమాటా మాత్రం ఇందులో చేర్చకూడదు.

ఏడవ రోజు డైట్:

చివరి రోజున బ్రౌన్ రైస్, పండ్లు మరియు ఆకుకూరలు తీసుకోవాలి. చివరి రోజున మీకు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ డైట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ డైట్ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి రోజు పని చేయడానికి శరీరానికి నిర్దిష్టమైన స్థాయిలో కేలరీలు అవసరం ఉంటుంది. అంతకంటే తక్కువ స్థాయిలో ఆహారాన్ని తీసుకున్నప్పుడు జీవక్రియ నెమ్మదిస్తుంది. ఈ చిట్కాను కేవలం అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించాలి. పెళ్లిచూపులు మరియు శుభకార్యాలకు వెళ్లే సమయంలో దీనిని ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ డైట్ ను ప్రతి రోజూ పాటించడం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ చిట్కాను ఉపయోగించాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad