Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము రోగ నిరోధక శక్తి పై ప్రభావితం చేసే అంశాలు ?

రోగ నిరోధక శక్తి పై ప్రభావితం చేసే అంశాలు ?

Science immunity resilience

ప్రస్తుత కాలంలో కరోనా వంటి భయంకరమైన వైరస్ లను ఎదుర్కోవాలంటే బలిష్టమైన రోగ నిరోధకశక్తిని ఏర్పరుచుకోవాలి.  రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అంటే, జీవన శైలిలో మార్పులు చేసుకోక తప్పదు. ముఖ్యంగా ధూమపానాన్ని మానుకోవడం మంచిది. 

ప్రభావ కారకాలు :

సిగరెట్లు:

సిగరెట్లు ‘నికోటిన్’ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. నికోటిన్ రోగనిరోధకశక్తిని అణచివేసే చర్యల్ని కలిగి ఉన్న పదార్ధం, అంటే రోగనిరోధక వ్యవస్థ యొక్క కార్యకలాపాన్ని నికోటిన్ తగ్గిస్తుంది. దీనివల్ల అంటు వ్యాధులకు గురయ్యే అవకాశం కలగొచ్చు. ఇది మీ ఉపరితల ఎపిథీలియల్ రోగనిరోధక ప్రతిస్పందనను విచ్ఛిన్నం చేస్తుంది. సాధారణంగా ధూమపానం చేయటం వలన శ్వాసకోశ అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కు  కారణం అవుతుంది.

ఒత్తిడి :

రోగనిరోధక శక్తి పనిచేయకపోవటానికి ఒత్తిడి కూడా ఒక కారణం. అధిక ఒత్తిడి  రోగనిరోధకశక్తి ని తగ్గిస్తుంది. కాబట్టి ధ్యానం మరియు యోగ సహాయంతో మీ ఒత్తిడిని జయించవచ్చు. 

నిద్ర :

నిద్రలేకపోవటం వలన తీవ్రమైన దుష్ఫలితాలు ఉంటాయి. ఒక ప్రత్యేక వ్యాధికారక క్రిమి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మన రోగనిరోధిక శక్తి దానిని గుర్తించి, తన మెమరీ సెల్స్ లో నిక్షిప్తం చేసుకుంటుంది. నిద్రలేమి సమస్యతోబాధపడుతున్న వ్యక్తులలో “సిర్కాడియన్ లయ”లో అధిక మార్పులు చోటుచేసుకుంటాయి. సిర్కాడియన్ లయ ఒక జీవసంబంధ గడియారం అది శరీరాన్ని పనితీరును క్రమ మార్గంలో ఉంచుతుంది. సిర్కాడియన్ లయ పనిచేయకపోతే, ఇమ్మ్యునోడెఫిసిఎన్సీ కి దారి తీస్తుంది. అందుకే వైద్యులు రోజుకు 7 నుండి 10 గంటలపాటు నిద్ర పోవాలని సిఫార్సు చేస్తారు. స్థూలంగా ఈ సూచనలు పాటిస్తే మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad