
మనిషి రోజంతా ఎంత పనిచేసినా రాత్రికి సరైన నిద్ర లేకపోతే ఆ ప్రభావం తన మరుసటి రోజుపై పడుతుంది. అవును.. మనిషి ప్రశాంతంగా పడుకునే సమయాన్ని వేరే పనులకు వినియోగిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో వారు ఊహించలేకపోతున్నారు. ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండటమే కాకుండా వారి ఆరోగ్యానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పనిఒత్తిడి కారణంగా సరైన నిద్ర లేకపోవడంతో చాలామంది అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు.
నిద్రలేమి కారణంగా మనకు జరిగే కొన్ని నష్టాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సరైన నిద్రలేకపోవడంతో వాహనాలు తోలేటప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. ఇందులో మన ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతున్నాము. ఇక నిద్రలేకపోవడంతో మనం రోజంతా ఏం చేశామో అది మరిచిపోతుంటాం. ఇది మన విచక్షణా బుద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
సరైన నిద్ర లేకపోవడంతో మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, డయాబిటీస్ వంటి అనారోగ్య రుగ్మతలకు గురవుతారు. నిద్రలేమి కారణంగా శృంగార సామర్ధ్యం కూడా తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. ఇక ఎక్కువ సమయం నిద్రలేకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాగా నిద్రలేకపోవడంతో వయసు మీద పడినట్లు కనిపిస్తుంది.