Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము కరివేపాకు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు?

కరివేపాకు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు?

AdobeStock 139241202 1

సాధారణంగా మనకి కరివేపాకు అంటే చిన్నచూపు. చాలా మంది కరివేపాకును కూరలో సువాసన కోసం మాత్రమే వేస్తూ ఉంటారు. తినే సమయంలో దాని పక్కన తీసి పడేస్తారు. కరివేపాకులో ఉన్న అద్భుత గుణాలు మరే ఇతర ఆకులలో లేవంటే అతిశయోక్తి కాదు. కరివేపాకు అనేక ఔషధ ఉపయోగాలున్నాయి. కరివేపాకును ఆయుర్వేద ఔషధాలు- జాత్యాది తైలం, జాత్యాది ఘృతం వంటి వాటిలో వినియోగిస్తారు. కరివేపాకు ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. లేత ఆకుల్లో సుగంధిత తైలం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అందుకే కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీనిని ఆహారంగా తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • ఎక్కువ మంది గృహిణిలు కరివేపాకును చారులో వినియోగిస్తారు. ఎందుకంటే? ఇది అజీర్ణాన్ని అరికట్టి ఎసిడిటీని తగ్గిస్తుంది. అందుకే ఈసారి చారు వేసుకునే సమయంలో కరివేపాకును కూడా నమిలేయండి.
  • కలుషిత ఆహారం మరియు నీరు తీసుకున్నప్పుడు జిగట విరేచనాలు కలుగుతాయి. ఆ సమయంలో కరివేపాకును తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలను కూడా నియంత్రిస్తుంది.
  • కరివేపాకులో ఉండే ఖనిజాలు మరియు ఇతర పదార్థాలు లభించవు. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
  • స్థూలకాయం కరివేపాకును తినడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. అనారోగ్యకరమైన కొవ్వును తగ్గించి గుండె పనిచేసే వేగాన్ని మార్చుతుంది. తద్వారా త్వరితగతిన కొవ్వు కణాలు కరిగిపోతాయి. 
  • కరివేపాకు మధుమేహం, రక్తపోటు, హైబీపీ ఉన్నరోగులకు కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కరివేపాకులోని లాక్సేటివ్ లక్షణాలు మలబద్దకాన్ని నివారిస్తాయి.
  • కరివేపాకులో ఉండే కార్బోజోల్ ఆల్కలాయిడ్ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది.
  • కరివేపాకు అధికంగా తీసుకున్న వారు క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రేరేపిత కారకాలను నియంత్రిస్తుంది అందుకే కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలి. 
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad