Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము ఏడుపు ఆరోగ్యానికి మంచిదే! ఏడవండి?

ఏడుపు ఆరోగ్యానికి మంచిదే! ఏడవండి?

GettyImages Motortion
Sad woman crying, suffering pain eyes full of tears, domestic violence victim

ఏడ్చి వ్యక్తులను చూస్తే చాలా మంది అసహ్యించుకుంటారు. మరి కొంత మంది ఆ ఏడుపు ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఏడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కళ్ళ నుండి కన్నీళ్ళు రావడం సర్వసాధారణంగా జరిగే విషయం. కొన్నిసార్లు ఆనందంగా ఉన్నప్పుడు కూడా కళ్ళ నుండి ఆనందభాష్పాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనసులోని భావోద్వేగాలు  అధికమైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. ఏడ్చేటప్పుడు మన శ్వాస క్రియ మారుతుంది కండరాలు వణుకుతూ తరువాత నిశ్చల స్థితిలోకి వెళ్లిపోతాయి, ఫలితంగా హాయిగా ఉంటుంది.

ఏడవడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడి మొత్తం దూరం అవుతుంది. దీని వలన మనస్సు కుదుట పడే అవకాశం ఉంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు కన్నీటి రూపంలో కొన్ని సార్లు బయటకు వస్తాయి. ఇది శరీరంలోని ఒత్తిడి మరియు హార్మోన్ల ఉత్పత్తి తగ్గిస్తుంది. భావోద్వేగ కన్నీళ్ళలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి కంటి దగ్గర ఉండే సూక్ష్మక్రిములను అంతం చేస్తుంది. ఏడుపు ద్వారా వచ్చే కన్నీళ్లు కంటి తేమను పెంచుతాయి. పొడిదనం, ఎరుపు కళ్ళు, దురద వంటివాటిని నివారించవచ్చు. ఏడ్చిన తర్వాత మెదడులో ఎండార్ఫిన్ హార్మోను విడుదల అవుతుంది. ఇది మనసును తేలిక పరుస్తుంది. ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే అది డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

తలనొప్పిని దూరం చేయటం, భావోద్వేగాలను సరిచేయటం వంటివి కన్నీళ్లు చేస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలు తప్పనిసరిగా ఏడవాలి. ఎందుకంటే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు బొడ్డుతాడు ద్వారానే ఆక్సిజన్ అందుతుంది. బిడ్డను ప్రసవించిన తరువాత స్వయంగా ఆక్సిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి పిల్లలు ఏడవడం ద్వారా ఊపిరితిత్తులు మరియు వాయునాళాలలో ఉన్న ద్రవాలు బయటకు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు పుట్టిన వెంటనే వైద్యులు వారిని ఏడిపించేటట్టు చేస్తారు.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad