Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఒక్క వ్యాక్సిన్ వందల ప్రశ్నలు ..

ఒక్క వ్యాక్సిన్ వందల ప్రశ్నలు ..

PicsArt 08 11 07.43.16

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనాకు అడుకట్ట వేయడానికి మరికొద్ది గంటల్లో రష్యా తయారు చేసిన “గమ్‌ కోవిడ్‌ ” వ్యాక్సిన్ మరికొద్ది గంటల్లో విడుదలకానుంది. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తో పాటు తయారవుతున్న మరికొన్ని కోవిడ్ వ్యాక్సిన్ల పైన అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ కు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ విడుదల చేయవలసి ఉంటుందని, ప్రజలు కూడా ప్రతి సంవత్సరం వ్యాక్సినేషన్ చేయించుకోవలసి ఉంటుందని తెలిపింది. వాస్తవానికి వ్యాక్సిన్ ను జీవితకాలంలో ఒక్కసారి వేయించుకుంటే చాలు. అయితే కోవిడ్ విషయంలో ఇలా ఉండే అవకాశం లేనట్లు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇన్‌ఫ్లూయెంజా వైరసులు నిరంతరాయంగా తన రూపాన్ని మార్చుకోవడంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండటమే. ఉదాహరణకు సాధారణ జలుబుకు 1930లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. 1990 తర్వాత అన్ని దేశాల్లో విస్తృతంగా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. అప్పట్లో ఒకసారి ఈ వ్యాక్సిన్ చేసుకుంటే జీవితంలో మరోసారి ఇన్‌ఫ్లూయెంజా సోకదను అన్నారు.

అయితే తరువాత పరిస్థితులన్నీ మారుతూ వచ్చాయి. అమెరికా వంటి దేశాల్లో వ్యాక్సిన్ తీసుకు వచ్చినప్పటికీ అది పూర్తిగా ప్రభావం చూపలేదు. ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ జీవితకాలం కేవలం ఒక సంవత్సరం అవ్వడంతో ప్రతి ఏడాది అమెరికన్లు ఫ్లూ వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్ ను తీసుకోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌కు అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్‌ కూడా ఇలా తరచూ వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో పుట్టిన కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటోంది. ఒకే దేశంలో నెలలు గడిచేకొద్దీ దానిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్లూ వైరస్‌ అంత వేంగంగా ఆ మార్పులు లేకున్నా, వైరస్‌ మాత్రం రూపాంతరం చెందుతోందని అంటున్నారు. దీనితో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ తన జీవిత కాలం ఎంత ఉంటుంది అనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ల ఇది కూడా ఈ సంవత్సరం పాటు వుండనుందా ! లేక పూర్తిగా పని చేయనుందా అన్నది మరికొద్ది నెలలో తేలిపోనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad