Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము వ్యాయామం ఏప్పుడు చేయాలి?

వ్యాయామం ఏప్పుడు చేయాలి?

5 Reasons Why Exercise is Important edits

వ్యాయామం అన్నది శరీరానికి చాలా మంచిది. అయితే ఏ సమయంలో వ్యాయామం చేస్తే అధిక లాభం కలుగుతుందన్నది ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదు. సాధారణంగా వ్యాయామం అనేది శరీరతత్వం పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది వ్యాయామాన్ని ఉదయం మరియు సాయంత్రం చేస్తారు. ఉదయం వ్యాయామం చేయడం ద్వారా ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది. రాత్రి నిద్రపోయే సమయంలో శరీరం నిశ్చల స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో శారీరకశ్రమ కలిగించినట్లయితే శరీరం వేగంగా శక్తిని పుంజుకుంటుంది. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అల్పాహారానికి ముందు వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని కొవ్వుకణాలను వేగంగా కరిగించవచ్చు. అంతే కాకుండా క్యాలరీలను ఎక్కువగా బర్న్ చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి.

చాలా మందికి ఉదయాన్నే లేవడం అతిపెద్ద సవాలు. నిద్ర నుండి లేచిన తర్వాత శరీరం బలహీనంగా ఉండవచ్చు. ఆ సమయంలో వ్యాయామం చేయడం ద్వారా శక్తి మరింత క్షీణిస్తుంది. ఉదయం పూట శారీరక శ్రమ చురుకుగా ఉండదు. దీనికి ప్రధాన కారణం శ్వాస వ్యవస్థ రాత్రంతా నిశ్చల స్థితిలో ఉండటమే. ఉదయం లేచిన వెంటనే మన కండరాలు, కీళ్లు గట్టిపడతాయి. అటువంటి సమయంలో వ్యాయామం చేస్తే అవి సడలిపోయే అవకాశం ఉంది. అందుకే  వ్యాయామానికి ముందు వామ్ అప్ చేయడం చాలా ముఖ్యం. ఉదయం పూట వ్యాయామం చేస్తే కొవ్వు ఎక్కువగా కరుగుతుంది అయితే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయటం వలన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.

సాయంత్రం వ్యాయామం కొంతమందికి ఎక్కువ లాభం చేకూరుతుంది. ఎందుకంటే వారు ఉదయం పూట ఉల్లాసంతో ఉంటూ సాయంత్రం అధిక శ్రమ చేస్తారు. శరీరం సాయంత్రం పూట అధిక శ్రమను ఖర్చు చేసే చేసే శక్తిని కలిగి ఉంటుంది. కానీ కొంత మంది వ్యక్తులు రోజంతా కష్టపడి సాయంత్రానికి అలసిపోవచ్చు. ఆ సమయంలో వ్యాయామం చేయడం సరైన పని కాదు. సాయంత్రం పూట కండరాలు, కీళ్ల పై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. కాబట్టి గాయాలు జరిగే అవకాశం తక్కువ. సాయంత్రం శరీరం సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి వ్యాయామం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. రోజంతా పని చేసి అలసిపోయిన వ్యక్తులు వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అంతే కాకుండా సాయంత్రం వ్యాయామం చేయడంతో గాఢనిద్ర పడుతుంది.

అన్నింటికి మించి సంతృప్తికరమైన వ్యాయామం తరువాత అధికంగా ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది మీ శరీరానికి ఎక్కువ శక్తిని అందించి బలంగా ఉండేటట్టు చేస్తుంది. సాయంత్రం లేదా ఉదయం వ్యాయామం చేయడమనేది శరీర ధర్మం పై ఆధారపడి ఉంటుంది. కొంతమంది రెండు పూటలా వ్యాయమం చేస్తారు, ఇలా చేయడం శ్రేయస్కరం కాదు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad