Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము సూర్య నమస్కారాలు చేయటం లేదా? ఈ లాభలన్నీ మిస్ అయిపోయినట్టే!

సూర్య నమస్కారాలు చేయటం లేదా? ఈ లాభలన్నీ మిస్ అయిపోయినట్టే!

PicsArt 08 12 01.56.48 1

మన దేశంలో చెట్టుని, పుట్టని కూడా దేవుడని మొక్కుతాం. మరి ప్రత్యక్షంగా కంటికి కనిపించే సూర్య భగవానుడి సంగతేంటి? ఆయనని ఆరోగ్యానిచ్చే దేవుడంటోంది శాస్త్రం. అందుకే, యోగాలో అత్యంత ముఖ్యమైన అంశంగా సూర్య నమస్కారాలు చేర్చబడ్డాయి. అయితే, కొందరు అజ్ఞానం వల్ల భావిస్తున్నట్టు సూర్య నమస్కారాలు సూర్యుడికి పెట్టే దండాలు కావు. అవి అసలు పూజలు, పునస్కారాలకు సంబంధించినవే కావు! మొత్తం శరీరాన్ని, మనస్సుని కూడా ఉత్తేజితం, చైతన్యవంతం చేసే అద్బుతాలు!
సూర్య నమస్కారాలు ఎలా చేయాలి? ఇంటర్నెట్ లో బోలెడు వీడియోలు కనిపిస్తాయి. పన్నెండు దశల్లో చేసే సూర్య నమస్కారం మొత్తం శరీరాన్ని కదిలిస్తూ సాగుతుంది. అందుకే, దీని వల్ల అనేక ఆరోగ్య లాభాలున్నాయంటున్నారు ఆధునిక పరిశోధకులు. అయితే, మన పెద్దలు ఈ వ్యాయామాన్ని సూర్యుడికి అభిముఖంగా తెల్లవారుఝామున ఎందుకు చేయమన్నారంటే… శరీరంతో పాటూ మనస్సు కూడా ఎంతో లాభపడుతుందని! ఉదయించే సూర్యుడి లేలేత కిరణాలు మనపై సోకటం వల్ల నిరాశా, నిస్పృహలు పోయి జీవితం ఆనందమయం అవుతుంది.


సూర్య నమస్కారాల్ని మత సంబంధ విశ్వాసాలతో చేసినా, ఏవీ లేకుండా చేసినా… కొన్ని ప్రధానమైన ఉపయోగాలు మాత్రం తప్పనిసరి. అవేంటో తెలిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ముందుగా…. సూర్య నమస్కారాల వల్ల మనకు ఒనగూరే కీలకమైన లాభం… అధిక బరువు తగ్గటం! ఆహార అలవాట్లు, జీవన శైలి వస్తోన్న అధిక బరువు క్రమంగా సూర్య నమస్కారాలు ఆచరిస్తే మటుమాయం ఆవుతుంది!
సూర్య నమస్కారాల్లో ఒంట్లోని ప్రతీ అంగం కదులుతూ వుండటం వల్ల కండరాలు గట్టి పడతాయి. కీళ్లు కూడా చక్కగా పని చేస్తూ వుంటాయి. ఇక మనం ఊహించని మరో లాభం ఏంటంటే… సూర్య నమస్కారాల వల్ల శరీరంపైని చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతుందట.


సూర్య నమస్కారాలు ఇతర సాధారణ వ్యాయామాల వంటివి కావు. శరీరంపైన మాత్రమే కాక లోలోన కూడా అనేక మంచి మార్పులకు శ్రీకారం చుడతాయి. సూర్య నమస్కారాలు చేస్తూ వుంటే జీర్ణ వ్యవస్థ సమర్థంగా పని చేసి తిన్న ఆహారం ఎలాంటి ఇబ్బంది కలిగించదు. కొందరికి విపరీతంగా అశాంతి కలిగించే నిద్రలేమి కూడా వీటి వల్ల అమాంతం పరుగు తీస్తుంది. సూర్య నమస్కారాలు క్రమంగా చేసేవారికి చక్కటి నిద్ర పడుతుంది.


సూర్య నమస్కారాలు తప్పక చేసే స్త్రీలలో ఋతు క్రమానికి సంబంధించిన ఇబ్బందులు దూరమవుతాయట. ఇక ఇప్పుడు పెద్ద సమస్యగా మారిన షుగర్ వ్యాధి కూడా ఈ నమస్కారాలు చేయటం వల్ల నియంత్రింపబడుతుంది. రక్తంలో షుగర్ స్థాయి పెరగకుండా వుంటుంది. అలాగే, ఒంట్లోని విష పదార్థాలు కూడా సూర్య నమస్కారాల ఆచరణ వల్ల బయటకి వెళ్లిపోతాయి. అన్నిటి కంటే ముఖ్యంగా, రోజంతా ఊరుకులు పరుగులు పెట్టే మన జీవితంలో ప్రతీ క్షణం ఉద్విగ్నత పెరుగుతోంది. అది కూడా సూర్య నమస్కారాలకు బెదిరి మన నుంచీ దూరంగా వెళ్లిపోతుంది. ప్రశాంతమైన మనస్సు మన స్వంతం అవుతుంది!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad