Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము ఇంటి ఈశాన్యంలో ఏ మొక్కలు ఉండాలి…

ఇంటి ఈశాన్యంలో ఏ మొక్కలు ఉండాలి…

PicsArt 08 12 03.57.38

మన ఇళ్లలో మొక్కలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కొందరు గార్డెన్ను ఏర్పాటు చేసుకుని మరీ పెంచుతుంటారు. చాలా మంది వృక్షం దేవతా స్వరూపం అని భావిస్తుంటాం. మీరు ఇల్లు కట్టుకునేప్పుడు ఖాళీ స్థలం ఉంటే …….అందులో వేప మొక్కను నాటుకోండి. వేప చెట్టు నుంచి వచ్చే గాలి అనారోగ్య లక్షణాలను పారద్రోలుతుంది.

PicsArt 08 12 03.55.34

అలాగే ఖాళీగా ఉన్న ప్రాంగణంలో మీరు వేసుకోవాల్సిన వృక్షరాజాల్లో రెండు ఉసిరి , మారీడు . ఈ రెండు విశిష్ట తత్వాలను ప్రసాదిస్తాయి. మీ గృహమే ఒక ఆధ్యాత్మిక కేంద్రమనే భావన వస్తుంది. కారణం కార్తీక మాసంలో మారీడు చెట్టుకు నీరు పోయడం, ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి రూపాన్ని ఉంచి ధ్యానం చేసి భోంచేయడం….ఇది ఎంత గొప్ప విశిష్ట పుణ్యఫలమో. అందుకే అలాంటి చెట్లు ఇంటి ప్రాంగణంలో ఉంచుకోవాలి.

PicsArt 08 12 03.55.18

ఇక పనస చెట్టు ఉంటే అదృష్టం. సంతాన ప్రాప్తి కలుగుతుంది. పనస కాయ చాలా గొప్పది. దానిలోపల అనేక తొనలు ఉంటాయి. ఆ తొనలే సంతానమని అర్ధం. అందుచేత పనస చెట్లు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. అలాగే పుష్పించే మొక్కల్లో గోవర్దనం, పలురకాలైన గోరింటా ప్రీతికరమైనవి. సన్నజాజి, గుండు జాజి ,మల్లెపూలు. ఇక సెంటు జాజి పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే……గృహయోగం సిద్ధిస్తుంది. సన్నజాజులతో పరమేశ్వరుడ్ని పూజిస్తే …..అద్దెకుండే ఇల్లును ఖాళీ చేసి సొంత గృహాన్ని కొనుక్కొని వెళ్తుంటారు.అంత విశేషవంతమైన ఫలప్రదాయని ఆ మొక్కల్లో దాగి ఉన్న అదృష్ట లక్షణం. అలాగే ఇంటి ముంగిట రెండు వైపులా కూడా కృష్ణ తులసి, లక్ష్మీతులసి …ఈ రెండు మొక్కలను నాటితే ఆ గృహం లక్ష్మీనిలయం, పావని నిలయంగా, ఆనంద నిలయంగా మారుతుంది. అరటిచెట్లు లాంటివి…. ఇంట్లో ఖాళీ ప్రదేశం బాగా ఉన్నప్పుడు అలాంటి చెట్లను వేసుకోవడం తప్పులేదు. లక్ష్మీదేవికి పద్మాలు చాలా ప్రీతి. అందుచేత ఇంటి ప్రాంగణ ఈశాన్య మూలలో కొద్దిగా ఖాళీ ఉంచి…… అక్కడ నీళ్లలో ఆ పద్మతత్వానికి సంబంధించిన పూలు పూసేటువంటి మొక్కలను నాటుకోవాలి. ఆ పద్మం రాగానే పుష్పాన్ని మనస్పూర్తిగా కళ్లకు అద్దుకుని లక్ష్మీదేవికి అర్పించినట్లైతే…… మీ గృహం పరమపావనంగా మారుతుంది.

PicsArt 08 12 03.54.57

లక్ష్మీకటాక్షం సిద్ధించడానికి మార్గం తామరపూసలు అంటుంటారు. ఈ తామరపూసల దండను లక్ష్మీదేవి పటానికి వేసి చూడండి. అద్భుతమైన లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అవే పద్మపుష్పాలు. వాటి కింద ఆ గింజలు ఉంటాయి. ఆ గింజలతోనే లక్ష్మీమంత్రాన్ని ఉపదేశం పొంది ఏ ఇంటి యజమాని అయితే ధ్యానం చేస్తాడో…….అతనికి లక్ష్మీదేవి కటాక్షిస్తుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మొదుగు మొక్కలు డెకరేషన్ చెట్లగా కూడా….. మన ఇంట్లో డ్రాయర్ మీద పెట్టుకునే విధానం ఉంటుంది. రోజురోజుకు ఒక్కొ ఆకు మొలకెత్తుతూ ఉంటే …..క్రిష్ణ పరమాత్మ లాలిణ్య లావణ్య మేథాకారక సంపత్తి ఇంటి యజమానికి సిద్ధిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆ మొక్క వైపు చూసి మాట్లాడుకోగలుగుతారు. అలాగే మనీ ప్లాంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని వల్ల నిజంగా డబ్బులు కురిపిస్తుందని అర్ధం కాదు. మనీ ప్లాంట్ అంటే పచ్చదనం గొప్పతనం. నిద్ర లేవగానే ప్రకృతిని చూసేందుకు వీలుగా….. మనీ ప్లాంట్ ను చూస్తు ఉండాలి. ముళ్లు ఉండే చెట్లు, పాలు కారే చెట్లు ఇంటి ప్రాంగణంలో నాటడం మంచిది కాదు.
కలబంద అని ఒక మొక్క ఉంది. ఈ కలబందను ఎవరికీ హాని కలగకుండా దక్షిణ దిక్కున నాటొచ్చు. ఆ కలబందను ఇంట్లో గుమ్మడి కాయ మీద తగిలిస్తే నరఘోష పోతుందని శాస్త్రం. కలబంద ఆరోగ్య ఔషధ యుక్తమైన చెట్లుగా కూడా గ్రహించాలి. అలాగే చామంతి . వీటిని చూడగానే ఆ సృష్టికర్త ఎంత అందంగా తీర్చిదిద్దారని అనిపిస్తుంది. ఇక మందార పువ్వు. పెద్దగా ఎర్రగా ఉంటుంది. అలాంటి మందార పువ్వును వాయువ్యంలో పెడితే …సమస్త వాస్తుదోషాలు పోతాయి.

images 15

వాయువ్యం ఖాళీగా ఉన్నప్పుడు మందార చెట్లను నాటండి. చామంతి పూలు. చామంతి పూలు పరమాత్ముడికి ఎంతో ఇష్టం. ఆ పూలతో అలా పూజ చేస్తూ ఆ జగన్మాతుకు నమస్కారం చేస్తే…… ఆ తల్లి నవ్వుతూ కనిపిస్తుంది కదా. మందార పువ్వును కళ్లకు అద్దుకుని ఆ జగన్మాతకు సమర్పించిన తర్వాత …… ఒకసారి ఆ ఫోటో చూస్తే నవ్వుతూ , దేవత మనల్ని ఆశీర్వదిస్తున్న భావన కలుగుతుంది. అలాగే గోరింటా పూలు, వివిధ రకమైన గోరింట పూలతో భగవంతుడ్ని అర్చన చేస్తే అక్కడ ఇంద్ర ధనస్సు కనిపిస్తుంది. ఆ భావన పరంపర కోసం సృష్టి కర్త ఏర్పచిన అపురూప విన్యాస సంపద …….ఈ మొక్కలో దాగి ఉన్న పరమార్ధం. అందుకే వృక్షోరక్షిత రక్షితహా అంటారు. ఏ ఇంట అయితే మొక్కల పెంపకం ఉంటుందో…ఏ ఇంట వృక్షాలను పరిరక్షిస్తారో …ఆ ఇంట సర్వేశ్వరుడి దివ్యవంతమైన అనుగ్రహం ఉండి తీరుతుంది. అందుకే చోటు ఉంచుకునేలా ఇల్లు నిర్మాణం చేసుకుని ….ఆ స్థలంలో చక్కటి పూల మొక్కలను పెంచితే చాలా మంచిది. ఇక తుమ్మి పూలు పరమేశ్వరుడికి చాలా ఇష్టం. చెట్టు చూడటానికి చిన్నది. పూలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ అవి చూడాటానికి పూలు చాలా అందంగా ఉంటాయి. అవి తీసుకొచ్చి పరమేశ్వరునికి అభిషేకం చేసి…అనుగ్రహించి స్వామి అని కోరుకోవాలి. ఇక తులసి చెట్ల వనం. చక్కగా వనం చేసి రోజూ ఆ తులసి కోసి ఆ విష్ణుమూర్తికి సమర్పిస్తే… మనసుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇలా రకరకాల మొక్కలను ఈశాన్యంలో నాటి పెంచుకుంటే…ఆ ఇల్లు ఆనందమయంగా మారుతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad