
ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవంతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారిలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. కాగా ఈ వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం అమాంతం పెరుగుతూ వస్తోంది. ఇక ఈ వైరస్ బారిన పడ్డవారిలో ఎక్కువగా మద్యం అలవాటు ఉన్న వారే ఉండటం గమనార్హం.
కాగా మద్యం సేవించడంతో మన ఆరోగ్యానికి హాని జరుగుతుందని వైద్యులు ఎంత చెప్పినా కూడా మనలో చాలా మంది ఆ అలవాటును మానలేకపోతున్నారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ సోకేందుకు ఈ మద్యం అలవాటు ముఖ్య కారణంగా నిలుస్తుందనే విస్తుపోయే వార్తతో మందుబాబులకు దిమ్మతిరిగిపోతుంది. అవును.. మన శరీరంలోని రోగనిరోధక శక్తి కణాలు ఊపిరితిత్తుల్లోకి హానికారక క్రిములు రాకుండా అడ్డుకుంటాయి. కానీ మద్యం సేవించడంతో ఈ కణాలు దెబ్బతింటాయి.
అంటే కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకండా అడ్డుపడే రోగనిరోధకశక్తి కణాలను మద్యం అలవాటు దెబ్బతీయడంతో, ఆ వైరస్ సునాయాసంగా లోపలికి వెళ్లిపోతుంది. అందుకే మద్యం అలవాటు ఉన్న వారు వీలైనంతవరకు దాన్ని పక్కనబెడితే వారి ఆరోగ్యంతో పాటు ప్రాణం కూడా బాగుంటుంది. కానీ మద్యానికి అలవాటు పడి ఈ విషయాన్ని మరిస్తే వారు కరోనాతో కాటేయించుకునేందుకు రెడీ అవ్వాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.