Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము లేవగానే ఈ పని చేస్తే… రోజంతా ఆరోగ్యం, విజయం!

లేవగానే ఈ పని చేస్తే… రోజంతా ఆరోగ్యం, విజయం!

sleep wake up bed thinkstockphotos 76765607

పడుకోవటం , లేవటం, తినటం, తిరగటం, మళ్లీ పడుకోవటం! జీవితం అంటే ఇంతేనా? ఇంతే అయితే మనిషి జంతువుగా మారిపోతాడు. మనిషి లేచింది మొదలు పడుకునే దాకా విద్యా, ఉద్యోగం, సంపద, సంతోషం, పెళ్లి, సంతానం… ఇలా ఎన్నిటి గురించో తాపత్రయపడుతుంటాడు. వాట్ని తీర్చుకోవటం కోసం కష్టపడుతుంటాడు. కానీ, కొందరికి అన్ని కోరికలు చకచకా తీరిపోతాయి. కొందరు మాత్రం చతికిల పడుతుంటారు. ఎందుకని? మనిషి పూర్వజన్మ కర్మ ఫలం వల్ల కలగిన పాపం, పుణ్యం ఈ జన్మలో ఫలితాలు ఇస్తుంటాయని నమ్ముతారు హిందువులు. అందుకే, పెద్దలు కుజ దోషం, కాల్ప సర్ప దోషం వంటివి చెప్పారు. ఇవన్నీ గత పాపల వల్లే ప్రాప్తిస్తుంటాయి.

ఆ దోషాల వల్ల అనేక సమస్యలు ఏర్పడి మనః శాంతి లోపిస్తుంది. చివరకు, మనిషి జీవితంలో అతి ముఖ్యమైన రెండు అంశాలు లోపిస్తాయి. అవే… ఆరోగ్యం, విజయం! ఈ రెండూ లేకపోతే ఎన్ని వున్నా, లేకున్నా ఒక్కటే! మనిషి ఆరోగ్యంగా వుండకుంటే ఎంత ఆస్తిపాస్తులు, ఎన్ని సుఖాలున్నా ఆస్వాదించలేడు. ఇక పదే పదే ఓటములు ఎదురై ఏదీ కలిసిరాకపోతే కూడా డీలా పడిపోతాడు. జీవితం నిస్సారంగా తోస్తుంది. మరి ఆరోగ్యం, విజయం అందించే పరిష్కారం ఏంటి? మనిషి జీవితాన్ని మంచి ఫలితాల దిశగా మరల్చే ఎన్నో అద్భుత పరిష్కారాలు గ్రంథాల్లో వున్నాయి. అయితే, కుజ దోషం, సర్ప దోషాల వంటివి కూడా అణిచిపెట్టి మనకు ఆరోగ్యం, విజయం అందించే అతి సులవైన ఉపాయం ఒక్కటి మాత్రం అందరూ తప్పక తెలుసుకోవాలి. ఇది దోషాలున్నవారు, లేని వారు అందరూ చేయాలి. ఎన్నో గొప్ప ఫలితాలు తప్పక సిద్ధిస్తాయి.

మీరు రాత్రి పడుకునే ముందు ఒక శుభ్రమైన రాగి చెంబు తీసుకోండి. అందులో ఏడు చుక్కల తేనె వేయండి. ఇక ఆ తరువాత ఏదైనా ఒక చిన్న బంగారు ముక్కని ఆ నీళ్లలో వేయండి. నిత్యం వాడని బంగారమై వుండాలి. ఉంగారం లాంటివి వేసినా ఫర్వాలేదు. కానీ, తేనె నీళ్లలో వేసే ఆ బంగారం మరెక్కడా వాడకూడదు. అలా తేనే, బంగారంతో కలిసిన నీరు రాత్రంతా మీ తల వద్దే వుండాలి. రాగి చెంబుకి రాగితోనే తయారు చేసిన మూతని పెట్టండి. తెల్లవారుఝామున లేచిన తరువాత రాగి చెంబులోని నీటిలోంచి బంగారాన్ని తీసేయండి. తేనె నీళ్లని గటగటా తాగేయండి. పరిగడుపున … బ్రష్ కూడా చేయకుండానే… ఈ నీరు తాగాలి. రాత్రంతా నోళ్లో ఊరిన లాలా జలం ఉదయం కడుపులోకి పోవటం ఎంతో మంచిదని సైన్స్ కూడా చెబుతోంది. కాబట్టి నిస్సంకోచంగా తేనే నీళ్లు తాగేసేయండి. తరువాత దైవ స్మరణ చేసుకుని మంచం దిగి కాలకృత్యాల్లో పడండి!

ఉదయం లేవగానే ఇలా చేయటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. అయితే, అంతకంటే ఆశ్చర్యకరంగా రోజంతా మీరు చేపట్టిన పనులు గతంలో కంటే సులవుగా పూర్తవుతాయి. మీ జీవితంలోకి విజయం స్పష్టంగా తొంగి చూస్తుంది!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad