
మనిషి జీవితంలో గాలి,నీరు, ఆహారం తరువాత ప్రకృతి పరమైన కనీస అవసరం ఏంటి? శృంగారం! అది వుంటేనే మానవ జాతి మనుగడ కొనసాగేది. ఆ విషయం తెలుసు కాబట్టే మన పెద్దలు శృంగారాన్ని గోడలపై శిల్పాలుగా కూడా చెక్కారు. అంతే కాదు, మన రోజు వారీ ఆహారంలో శృంగార సామర్థ్యం, ఉత్సాహాన్ని పెంచే ఎన్నో పదార్థాలు అంతర్భాగంగా చేర్చారు. కానీ, ఇప్పుడు సెక్స్ అంటే బూతు పదంగా మారిపోయింది. అందరూ రహస్యంగా దాని కోసమే వెంపర్లాడుతున్నా పైకి వద్దన్నట్టు ప్రవర్తిస్తుంటారు. శృంగారం విషయంలో అతి అవసరం లేకున్నా… ఆరోగ్యకర శృంగారం ఎంతో అవసరం. సెక్స్ లైఫ్ హ్యాపీగా లేకపోతే జీవితం నరకప్రాయం కూడా అవ్వొచ్చు.
జీవితానికి ఎంతో ముఖ్యమైన శృంగారం చాలా వరకూ మనిషి తినే తిండి మీద ఆధారపడుతుంది. ఎలాగంటే, ఆహారం వల్లే ఒంట్లో రక్త ప్రసరణ ప్రభావితం అవుతుంది. ఎంత చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ వుంటుందో మనిషి అంత ఆరోగ్యకరమైన శృంగార జీవితం గుడుపుతూ వుంటాడు. ముఖ్యంగా, రక్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా మర్మాంగాల వద్దకి, మెదుడులోకి ప్రవహిస్తూ వుంటే … శృంగార వాంఛ , సామర్థ్యం నిరాటంకంగా నెలకొంటుంది. మరి ఆరగ్యోకర రక్త ప్రసరణకి ఉపకరించే మూడు ముఖ్యమైన ఆహారాలు ఏంటి? పాలకూర… ఈ పేరు వినగానే శృంగారానికి , దీనికి సంబంధం ఏంటి అనుకుంటారు! కానీ, చాలా పెద్ద లింకే వుంది.
మనిషి సెక్స్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్… జింక్! ఇది పాలకూరలో పుష్కలంగా వుంటుందట. పాలకూరలో ఫాలిక్ యాసిడ్ కూడా పెద్ద ఎత్తున వుంటుంది. అది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కారణాల చేత పాలకూర తప్పక తినాలి. అయితే, పాలకూరని బాగా నూనెలో ఫ్రై చేయటం, లేదా పాలక్ పన్నీర్ లాంటి వంటకాలు చేసుకోటం చేయకూడదు. పాలకూరని సలాడ్లలో కలుపుకుని తినాలి. లేదంటే చాలా తక్కువగా ఉడికించి తినాలి. మొత్తం మీద పచ్చటి పాలకూరని ఎంత సహజంగా అయితే అంత సహజంగా కడుపులోకి పంపాలి. ఇక సెక్స్ లైఫ్ బూస్ట్ చేసే మరో ఆహారం… తులసి ఆకులు! ఇవి కూడా తమలోని న్యూట్రీషినల్ వాల్యూస్ కారణంగా రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి.
కాకపోతే, తులసీ ఆకులు ఎలాంటి కురలాగా కూడా మనం చేయం కాబట్టి నేరుగా నమలవచ్చు. అలా కాకుండా ఓట్స్ లాంటివి వండుకున్నప్పుడు చివర్లో గార్నిష్ చేసుకోవాలి. అన్నంలోనూ ఇబ్బంది లేని వారు తులసి ఆకులు కలిపి తినవచ్చు. ఎలాగైన వేడి తగలకుండా చూసుకుంటే తులసీలోని ఔషధ గుణాలు పోకుండా వుంటాయి. శృంగార సామర్థ్యం పెంపొందించే మూడో ఆశ్చర్యకర ఆహారం… పుచ్చకాయ! ఎండా కాలంలో వచ్చే ఈ పండు తింటే ఒంట్లోకి సిట్రోలిన్ అనే అమీనో యాసిడ్ వచ్చి చేరుతుంది. ఇది తరువాత నైట్రోజన్ ఆక్సైడ్ గా మారుతంది. ఈ పరిణామం వల్ల కూడా రక్తం నిరాటంకంగా ప్రవహిస్తూ మనస్సుకి, శరీరానికి కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది. ఉత్సాహం వుంటేనే కదా శృంగారంపై మనసు మళ్లేది!