
కరోనా వైరస్ కారణంగా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఆహారం తీసుకునే విషయంలోనూ ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే శరీరానికి మంచి జరుగుతుందో అనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. చాలా తక్కువ మందికి తెలిసిన పండు గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.
ఆరోగ్యానికి మంచి చేసే చాలా పండ్లను మనం నిత్యం తింటూ ఉంటాం. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో వారికి కూడా తెలియదు. అమెరికాలో పుట్టిన ఈ డ్రాగన్ ఫ్రూట్ గతంలో మన దేశంలో చాలా తక్కువగా దొరికేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ పండు ఎక్కువ మోతాదులో అందుబాటులో ఉంది. కాగా ఈ పండు చూడటానికి డ్రాగన్ నోట్లో నుండి వచ్చే మంటలా ఉంటుంది. అందుకే దీనికి డ్రాగన్ ఫ్రూట్ అనే పేరు పెట్టారు. ఇక ఈ పండులో సి, ఈ విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం లాంటి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
క్యాలరీలు తక్కువగా ఉండే ఈ పండును రోజూ తీసుకుంటే మనం బరువు త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ పండును రోజు తింటే చాలా చురుకుగా ఉంటారు. జీర్ణప్రక్రియకు ఎంతో ఉపయోగపడి, మలబద్దకాన్ని నిర్మూలిస్తుంది. ఇక ఈ పండులో ఉండే బెటాలైన్స్, కెరొటినాయిడ్స్లు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఒక్క పండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే మీరు మీ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకోండి.