Home టాప్ స్టోరీస్ బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే ఏం అవుతుందో తెలుసా?

బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే ఏం అవుతుందో తెలుసా?

Keto breakfast h

పెరుగుతున్న నగరీకరణ మరియు బిజీ లైఫ్ కారణంగా చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉద్యోగాలకు వెళుతూ ఉంటారు. మరి కొంతమంది డబ్బును పొడుపు చేద్దాం అనుకోని ఉదయం అల్పాహారం చేయకుండా నేరుగా మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే ఇలా చేయడం ద్వారా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారం నాలుగు గంటల్లో జీర్ణమవుతుంది. రాత్రిపూట స్వల్పంగా ఆహారం తీసుకొని నిద్రపోతున్న సమయంలో శరీరం సుప్త వ్యవస్థలో ఉంటుంది. ఉదయం లేచే సరికి మీరు రాత్రిపూట తీసుకున్న శక్తి ఖర్చయిపోతుంది. అందుకే తప్పనిసరిగా ఉదయం అల్పాహారం తీసుకోవాలి. అలా చేయని పక్షంలో మీ శరీరానికి శక్తి అందదు.

ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే రక్తహీనతకు దారి తీయవచ్చు. శరీరంలో శక్తి లేనప్పుడు పనిపై ఆసక్తి తగ్గి చిరాకు ఎక్కువ అవుతుంది. శరీరానికి కావాల్సిన 60 శాతం పోషకాలు ఉదయం చేసే అల్పాహారం ద్వారానే లభిస్తాయి. సాధారణంగా మనిషి రోజుకు 4 సార్లు ఆహారం తీసుకోవాలి. పగటి పూట నాలుగు సార్లు రాత్రి పూట రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరు గంటల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకపోయినట్లయితే శరీరం కుచించుకుపోతుంది. అదే 8 గంటల పాటు ఆహారం తీసుకోకపోతే కడుపులో ఆమ్లాలు వేగంగా ఏర్పడి గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. పెరుగుతున్న పిల్లలు ఉదయం పూట అధికంగా ఆహారం తీసుకోవాలి.

ఆహారం తీసుకునే విధానంలో రాత్రిపూట తక్కువగా ఉదయం ఎక్కువగా తీసుకోవాలి. అల్పాహారం మానసిక శారీరక స్థితిని మార్చి వేయగలదు. మెదడు చురుగ్గా పని చేయాలన్నా రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలి అన్న తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. తాజా అధ్యయనాల ప్రకారం అల్పాహారం 8 గంటలలోపే తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు మరియు పాలను తీసుకోవడం ద్వారా అధిక శక్తి లభిస్తుంది. చిన్న పిల్లలైతే తప్పనిసరిగా పాలు అందించాలి. ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad