Home లైఫ్ స్టైల్ ఫుడ్ ఒక్క అరటిపండు తింటే ఎంత మేలో తెలుసా…?

ఒక్క అరటిపండు తింటే ఎంత మేలో తెలుసా…?

banannas1

అరటిపండు అన్ని సమయాల్లో అందరికీ ప్రియమైన మరియు చవకగా దొరికే పండు. అందుకే దీనిని పేదవాడి ఆపిల్ గా పిలుచుకుంటారు. ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ. అరటి పండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీనిని మీరు రోజువారీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఒక అరటి పండు తింటే 3 యాపిల్ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్లు తిన్నట్లే. అరటికాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే రోజుకి ఒక్క అరటి పండు అయిన తింటారు.

ఒత్తిడిలో ఉన్నప్పుడు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు, తగినంత శక్తిని పొందవచ్చు. ఎనర్జీ వల్ల మీ శరీరంలో బ్లడ్ స్థాయిలు స్థిరంగా కొనసాగటానికి సహాయపడుతాయి. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే రుతు సమయంలో కలిగే నొప్పి, రక్తస్రావం తగ్గుతాయి. ఒక్క అరటి పండు తినడం వల్ల వ్యాయమం సమయంలో కండరాల తిమ్మెరలను నివారించడానికి మరియు రాత్రుల్లో కాళ్ళ తిమ్మెరలను నివారించడానికి సహాయపడతాయి.వేవిళ్లతో బాధపడే గర్భిణులకు అరటి పండు తినిపిస్తే తగినంత శక్తితోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా అందుతుంది. అరటిపండ్లులో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది.

నీరసంగా ఉన్నవారికి ఒక అరటిపండు ఇస్తే చాలు మునిపటిలా శక్తిని పుంజుకుంటారు. బాగా పండిన అరటిపండులో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. క్రికెట్‌ ఆటగాళ్లకు శక్తినివ్విడానికి అరటిపండ్లను ఇస్తారు. ఇవి తొందరగా జీర్ణమై శక్తిని ఇస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చిగా ఉన్న అరటిపండ్లను వెంటనే తినేయకూడదు. వాటిని రెండు రోజులపాటు కవర్లో ఉంచితే పండుతాయి. పండిన వాటిలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.

పసిపిల్లలకు పాలు మాన్పిస్తే అరటిపండును మెత్తగా, గుజ్జులా చేసి ఆహారంగా ఇవ్వాలి. ఇలా తినిపిస్తే అనేక ప్రయోజనాలుంటాయి. ఇది అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇంకో ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి ఈ పండిన అరటిపళ్ళని షుగరు ఉన్న వ్యక్తులు తినకూడదు ఎందుకంటే ఇవి తియ్యగా ఉంటాయి కావున రక్తంలో గ్లూకోస్ స్థాయి ఎక్కువ అవుతుంది. అందుకనే షుగరు వ్యాధి గ్రస్తులు బాగా పండినది కాకుండా కొంచెం పచ్చిగా ఉన్న అరటిపండు తింటే మంచిది. అరటిపండు తినడం వల్ల ఎన్ని లాభాలో చూసారుగా ఇంకెందుకు ఆలస్యం కనీసం రెండు రోజులకు అయిన ఒక అరటిపండు తినండి. కుదిరితే రోజుకు ఒకటి తింటే మరి మంచిది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad