
రుచిగా భోజనం చేసేందుకు మనం రకరకాల ఆహారాలను తీసుకుంటాం. ఇక కొన్నింటిని ఇతర ఐటెమ్స్‌తో కలిపి తింటే ఆ రుచే వేరు అనే భావనతో మనం అనేక రకాల మిక్సిడ్ ఫుడ్‌ను తింటాం. అయితే కొన్ని ఐటెమ్స్‌ను కలిపి తినే కారణంగా మనం చేజేతులా ఆరోగ్యానికి హాని చేస్తున్నామనే విషయం మనకు తెలియకుండానే వాటిని తినేస్తాం. ఇలాంటి పదార్ధాలను తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడతాయి.
ముఖ్యంగా మాంసం, గుడ్లు లాంటి పదార్ధాలను పాల ఉత్పత్తులతో కలిపి తినకూడదు. చేపలు, వెన్న లేదా మీగడ ఎప్పటికీ కలిపి తినకూడదు. వీటిని కలిపి తింటే గ్యాస్ ఫాం అవుతుందని డాక్టర్లు హెచ్చిరిస్తున్నారు. అటు పండ్లు తిన్నాక వెంటనే మరే ఇతర ఆహారం తీసుకోకూడదు. పండ్లు తిన్నాక కనీసం రెండు గంటల తరువాతే వేరే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తీసుకోవాలని వైద్యులు తెలిపారు.
ఇక చల్లని, వేడి పదార్ధాలను కూడా ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు. ముఖ్యంగా కాఫీ, టీ, పెరుగు, ఐస్‌క్రీమ్ లాంటి కాంబినేషన్ అస్సలు తీసుకోకూడదు. అలాగే భోజనం చేశాక చల్లటి నీరు తాగకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ కుంటుపడుతుందని వైద్యులు తెలిపారు. తేనెను చాలా మంది టీ లేదా పాలలో కలుపుకుని తాగుతారు. అయితే అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు అంటున్నారు. వేడి పదార్ధంలో తేనె కలిసినప్పుడు అందులో ఉండే మైనం విషంగా మారుతుందని, అది ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వారు అంటున్నారు. అందుకే రుచి కోసమో, సరదా కోసమో ఇలాంటి కాంబినేషన్లు తీసుకోవద్దు.