Home టాప్ స్టోరీస్ గుడ్డుతో గుండె పదిలం

గుడ్డుతో గుండె పదిలం

Egg Is Good For Heart

రోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు అంటుంటారు. అయితే గుడ్డు రోజూ తినడం మంచిది కాదనే భావన కొందరిలో బలంగా పాతుకుపోయింది. దీంతో చాలా మంది రోజూ గుడ్డు తినేందుకు ఇష్టపడరు. అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ గుండెకు హాని చేస్తుందనే వాదన బలంగా వినిపించడంతో ఈ విషయంపై తాజాగా అధ్యయనం చేశారు.

కెనడా మెక్ మాస్టర్ యూనివర్సిటీ, హామిల్టన్ హెల్త్ సైన్సెస్‌కి చెందిన పరిశోధకులు ఈ మేరకు లక్షా 77 వేల మందిపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. అయితే కోడిగుడ్డు వల్ల గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్ పెరగడానికి, కోడిగుడ్డు తినడానికి ఎలాంటి సంబంధం లేదని ఈ అధ్యయనంలో తేల్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. ప్రొటీన్లు, పోషకాలు మెండుగా ఉండే గుడ్డును తీసుకోవడంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఈ అధ్యయనంలో వెల్లడయ్యింది.

మొత్తానికి గుడ్డుతో గుండెకు హాని జరుగుతుందనే వాదనలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు ఆరోగ్యం కోసం గుడ్డుకు నిస్సందేహంగా తినొచ్చు అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరి గుడ్డు తినవద్దు అనుకునే వారు ఈ అధ్యయనంతో తమ అభిప్రాయాన్ని మార్చుకుని గుడ్డును తింటారా లేక తమ వాదనే కరెక్ట్ అనుకుని గుడ్డును పక్కనబెడతారా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad