Home టాప్ స్టోరీస్ కునుకు తీస్తేనే లక్ష.. మీరూ ప్రయత్నించండీ!

కునుకు తీస్తేనే లక్ష.. మీరూ ప్రయత్నించండీ!

Company To Pay 1 Lakh For Sleeping

మనం ఉద్యోగానికి వెళ్లి రోజంతా కష్టపడితేనే అరకొర జీతాలను తెచ్చుకుని మన కుటుంబాన్నీ పోషిస్తున్నాము. ఇక ఉద్యోగులు కంపెనీలో పని చేసినందుకు గాను యాజమాన్యాలు వారికి జీతాలను ఇస్తూ వారికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఎవరైనా ఉద్యోగం చేసే సమయంలో అలసటగా ఉందని కాసేపు నిద్రపోతే, ఇక ఆ వ్యక్తికి చుక్కలు చూపిస్తుంటారు ఆఫీసు వాళ్లు. కానీ ఇక్కడ ఓ ఆఫీసు కేవలం నిద్రపోయినందుకే డబ్బులు చెల్లిస్తామంటోంది.

వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా, ఇది నిజం. బెంగుళూరులోని వేక్ ఫిట్ అనే సంస్థ స్లీప్ ఇంటర్న్‌షిప్‌తో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఎంపికైన వారు రాత్రి తొమ్మిది గంటకొట్టగానే టక్కుమని నిద్రపోవాలి. ఈ విధంగా రాత్రి 9 గంటలకు నిద్రపోయిన వారికి లక్ష రూపాయల వేతనం అందించనుంది ఈ సంస్థ. పడకెక్కిన పది ఇరవై నిమిషాలలో నిద్రలోకి జారుకోవడం, పూర్తి బద్దకంగా ఉండటం అదనపు అర్హతలుగా ఆ సంస్థ నిర్వాహకులు అంటున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపికయ్యే వారిని స్లీప్ ఎక్స్‌పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియల్ డిజైనర్లు, ఫిట్‌నెస్ నిపుణులు పర్యవేక్షణలో ఉంచబోతున్నారు. గతేడాది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1.7లక్షల మంది దరఖాస్తు చేస్తే, కేవలం 23 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈయేడు కూడా అంతే మందిని ఎంపిక చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. మరి నిద్రపోవడంలో మీరు కూడా ఉద్ధండులు అయితే మీ అదృష్టాన్ని ఓసారి పరీక్షించుకోండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad