
ముందుగా, మీ స్కిన్ ను చల్లటి నీళ్లతో శుభ్రపరుచుకోండి. ఇప్పుడు కాటన్ బాల్ పై టోనర్ ను తీసుకుని దాంతో ముఖాన్ని అలాగే మెడప్రాంతాన్ని సున్నితంగా మసాజ్ చేయండి.
ప్రతిరోజూ ఉదయాన్నే మీ స్కిన్ కోసం మీరు ప్రత్యేక కేర్ ను అందించాలి. దీన్నే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అని అంటారు. ప్రతి రోజూ స్కిన్ అనేక విధాలుగా స్ట్రైన్ అవుతుంది. ఎండ, దుమ్ము, పొల్యూషన్, చెమట, విపరీతమైన వేడి లేదా చల్లదనం ఇలా చాలా ఫ్యాక్టర్స్ స్కిన్ ను ఒత్తిడికి గురిచేస్తాయి. దాంతో, స్కిన్ తన సహజకాంతిని కోల్పోయే ప్రమాదం ఉంది. స్కిన్ లో తిరిగి గ్లో తెప్పించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే స్కిన్ కేర్ మార్నింగ్ రొటీన్ మీకు ఎంతగానో హెల్పవుతుంది.
సింపుల్ డైలీ రొటీన్ తో స్కిన్ హెల్త్ ను కాపాడుకోవచ్చు. ప్రతి స్కిన్ టైప్ డిఫెరెంట్ గా ఉంటుంది. మీ స్కిన్ కు ఏది పనిచేస్తుందో తెలుసుకుంటే అందుకు తగిన స్కిన్ కేర్ రొటీన్ ను మీరు డైలీ లైఫ్ లో భాగం చేయగలుగుతారు. ఇలా చేస్తే మీ స్కిన్ తో మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. స్కిన్ ప్రాబ్లెమ్స్ ను వెనువెంటనే అర్థం చేసుకోగలుగుతారు. ఇపుడు చెప్పుకోబోయే టోనర్ అన్ని రకాల స్కిన్ టైప్స్ కు పెర్ఫెక్ట్ గా సూటవుతుంది.