Home టాప్ స్టోరీస్ మాంసాహారం తినగానే పాలు ఎందుకు తాగకూడదు?

మాంసాహారం తినగానే పాలు ఎందుకు తాగకూడదు?

milk chicken

పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి లభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫుడ్ కాంబినేషన్స్ కూడా అందులో ముఖ్య పాత్ర వహిస్తాయి. వేరు వేరు ధర్మాలు ఉన్న ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. అందులో ముఖ్యమైనది పాలు – మాంసం. చాలామంది మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగుతూ ఉంటారు. మరి కొంతమంది హోటల్లో భోజనం చేస్తూ మాంసాహారంతో పాటు మిల్క్ షేక్స్ వంటివి తీసుకుంటారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మాంసాహారమైన చికెన్, మటన్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధికంగా ఉండే ప్రోటీన్లు శరీరానికి బలాన్ని చేకూర్చి కండరాలను బలపరుస్తాయి. అయితే పాలల్లో, మాంసాహారంలో కంటే అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ మరియు సెల్యులోజ్ వంటి వాటిని మానవ శరీరం త్వరగా జీర్ణం చేసుకోలేదు. రొయ్యలు, చేపలు మరియు చికెన్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా శరీరంలో గరిస్టంగా ప్రోటాన్ల స్థాయి పెరుగుతుంది. ఆ తరువాత పాలు తాగడం ద్వారా అందులో ఉండే ప్రోటీనులు కూడా శరీరంలోకి చేరతాయి. దీంతో శరీరంలో పరిమితికి మించిన ప్రోటీన్లు ఉన్నాయి.  ఇవన్నీ కలిసి శరీరంలో యూరిక్ యాసిడ్ ను అధికంగా ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది.

యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరం.ఈ యూరిక్ యాసిడ్ కీళ్లల్లో పేరుకుపోయి క్రిస్టల్స్‌గా మారుతుంది. దీని వలన గౌట్ తదితర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. మాంసాహారం, పాలును కలిపి తీసుకోవడంతో శరీరంలో ప్రోటీన్ల స్థాయి పెరుగుతుంది. ఈ ప్రోటీన్ బంధాలను విడగొట్టడానికి శరీరానికి అధిక శక్తి అవసరమవుతుంది. ఈ శక్తి వినియోగం మీరు తీసుకున్న ఆహారం కంటే అధికంగా ఉంటుంది. దీని వలన మీరు ఆహారం తీసుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ మిక్స్డ్ కాంబినేషన్ని అధికంగా తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఈ రెండు ఆహార పదార్థాలను ఏకకాలంలో తీసుకోవద్దు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad