సోయా తింటే కాన్సర్ దరి చేరదు…ట!

సోయా బీన్స్ తో మనం అనేక రకాల రెసిపీస్ తయారు చేసుకుంటూనే ఉంటాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ఉపయోగకరం కూడా. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు మనకి కలుగుతాయి. దీంట్లో 26 శాతం ప్రోటీన్ మనకి లభిస్తుంది. మొక్కల నుండి లభించే ప్రోటీన్స్ లో అన్నిటికంటే ఎక్కువ ప్రోటీన్స్ మనకి సోయా బీన్స్ లోనే లభిస్తాయి. సోయా బీన్స్ లో ప్రోటీన్ ఉంటుంది. మామూలుగా జంతువుల నుంచి వచ్చిన ప్రోటీన్స్ లో ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. పల్సస్ ప్రోటీన్ ఉండదు అయితే సోయి కూడా జంతువుల నుంచి లభించే ప్రోటీన్ల కి ప్రత్యామ్నాయంగా డైట్ లో మనం తీసుకోవచ్చు. అయితే మరి ఆ ప్రొడక్ట్స్ ఏమిటి అనే విషయానికి వస్తే…. సోయా పిండి, సోయా పాలు, కాటేజ్ చీజ్ మొదలైన వాటిలో దీనిని ఉపయోగించడం జరుగుతుంది.మాంసం తో సమానంగా ప్రోటీన్లు లభించడం సోయా లో మాత్రమే కుదురుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక నాణ్యమైన పద్ధతిని కనుగొన్నారు. ఆ పరిశోధన లో ఏమి తేలిందంటే..? సోయా లో జంతువుల మాంసం లో లభించే ప్రోటీన్లు సమానంగా ఉన్నట్లు కనుగొన్నారు. అలానే మిగిలిన మొక్కల నుంచి లభించే ఆహారం తో పోల్చితే సోయాలో ఎక్కువ ప్రొటీన్లు కలిగి ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల ప్రతి ప్రోటీన్లు కంటే దీనిలో ఎక్కువగా లభిస్తాయి. డైట్ లో తీసుకుంటే నిజంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. సోయాని సూపర్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు. నిజంగా అన్ని ఎక్కువ ప్రోటీన్స్ మరి మనకి లభిస్తాయి.పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ లో లినోలిక్ యాసిడ్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం విశేషం. సాధారణంగా తక్కువ మొక్కల నుండి మాత్రమే మనకి లభిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా మంచివి. గుండె సంబంధిత అనారోగ్యాలన్నీ ఇది తగ్గిస్తుంది మరియు కాన్సర్ రిస్కు కూడా తగ్గిస్తుంది. సోయాపిండి లో ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here