Home Latest News వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల‌..!

అమ‌రావ‌తి వైసీపీ కార్యాల‌యంలో జ‌రిగిన ఉగాది ప‌ర్వ‌దినం వేడుక‌ల్లో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. పూజా కార్య‌క్ర‌మం అనంత‌రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వైసీపీ మేనిఫెస్టోను వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విడుద‌ల చేశారు. అంత‌కు ముందు పంచాగ శ్ర‌వ‌ణం చ‌దివి వినిపించిన వేద పండితులు వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయ‌మ‌ని, ప్ర‌తి ప‌క్షాలు కూడా బ‌లంగానే ఉన్నాయ‌ని తెలిపారు.

అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని కొన్ని ప్ర‌ధానాంశాలు ఇలా ఉన్నాయి..

• ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు చెల్లిస్తాం – పంట వేసే సమయానికి అంటే ప్రతి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తాం
• రైతులకు వడ్డీ లేని రుణాలు
• వ్యవసాయానికి పగటి పూట 9 గంటల కరెంట్ ఇస్తాం
• రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం
• పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది
• రూ. 3 వేల కోట్ల ధర ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం
• అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ
• పేద,మధ్య తరగతి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ వైద్య పథకం
• 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఉచిత వైద్యం అందేలా పథకం
• హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం
• ప్రమాదవశాత్తు రైతు చనిపోతే బీమా రూ. 7లక్షలు ఇస్తాం
• సహకార డెయిరీకి పాలుపోసే పాడి రైతుకు లీటరుకు రూ.4 సబ్సిడీ
• కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా చట్టసవరణ చేస్తాం
• బీసీ, మైనార్టీ కౌలు రైతులకు రూ.12,500 పెట్టుబడి ఇస్తాం
• తలసేమియాలాంటి వ్యాధితో బాధపడుతున్న వారికి రూ. 1 0వేల పెన్షన్
• ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ ఆధునీకరిస్తాం
• చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం
• ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపు
• దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు పింఛన్
• రెండేళ్లలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు
• ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరానికి తగ్గట్టు వైద్యుల సంఖ్య పెంచుతాం
• విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్
• అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తాం
• 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ. 75 వేలు
• పింఛన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం
• ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం
• పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం
• ఇళ్లు ఇచ్చే రోజునే అక్కా చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్
• డబ్బులు అవసరమైన ఇంటి మీద పావలా వడ్డీకే రుణాలు
• పోలవరం సహా అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం
• వైఎస్ఆర్ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం … చెరువులను పునరుద్ధరిస్తాం..జలకళను తీసుకొస్తాం
• ప్రత్యేకహోదా సాధనకు అలుపెరగని పోరాటం చేస్తాం
• ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం
• గ్రామ సచివాలయం ద్వారా ఆ గ్రామంలోని 10 మందికి ఉద్యోగాలు
• 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమిస్తాం ..అన్ని పథకాలను ఆ వాలంటీర్ ద్వారా డోర్ డెలివరీ చేస్తాం
• ఏ సమస్య అయినా 72 గంటల్లోనే పరిష్కరిస్తాం
• ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా క్యాలెండర్ ను విడుదల చేస్తాం
• 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
• పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తెస్తాం
• జనవరి 1న ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ను విడుదల చేస్తాం
• ప్రభుత్వ కాంట్రాక్టర్లను నిరుద్యోగులకు ఇచ్చేలా చట్టం తెస్తాం
• నిరుద్యోగులు వాహనాలు కొనేందుకు సబ్సిడీ ఇస్తాం
• ఎన్నికల వరకు ఉన్న డ్వాక్రా రుణాలను 4 దఫాల్లో వారి చేతికే ఇస్తాం
• సున్నా వడ్డీ రుణాలను మళ్లీ తీసుకొస్తాం
• మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం
• మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం
• అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయిస్తాం – 13 లక్షల మందికి వెంటనే పరిహారం అందేలా చూస్తాం
• పేదల ఇళ్లపై ఉన్న రుణభారాన్ని పూర్తిగా రద్దు చేస్తాం
• తిరుమలలో స్వామివారి తలుపులను సన్నిథిగొల్లలు తెరిచే సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం
• 18-60 ఏళ్లలోపు ఏ పౌరుడైనా సహజ మరణం సంభవిస్తే వైఎస్ఆర్ జీవన పథకం కింద రూ. లక్ష అందిస్తాం
• గొర్రె కాపరులు చనిపోతే రూ. 6 లక్షల బీమా అందిస్తాం
• ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 10 వేలు ఇస్తాం
• ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో గిరిజన తండాల్లో ప్రతి ఇంటికి 2 వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
• ప్రతి స్కూళ్లోను ఇంగ్లీష్ మీడియం, తెలుగు తప్పనిసరి చేస్తాం
• పూర్తిస్థాయిలో టీచర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
• జర్నలిస్టులకు వారి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు వారి సమస్యలు పరిష్కరిస్తాం
• బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. 75 వేల కోట్లు ఖర్చు చేస్తాం
• బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారికి చట్టబద్ధత కల్పిస్తాం
• మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పరిహారం రూ. 10 వేలు
• ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకార కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం
• చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం…సున్నా వడ్డీకే రుణం అందిస్తాం
• బీసీ హక్కులకు భంగం కలగకుండా కాపుల రిజర్వేషన్ల కోసం మా ప్రయత్నం చేస్తాం
• ఆర్య, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం
• అర్చకులకు రిటైర్ మెంట్ విధానం రద్దు చేస్తాం
• అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం
• అర్చకులకు దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం పంచాయతీ జనాభా ప్రకారం రూ.10 వేల నుంచి 35 వేలు
• మైనార్టీలకు సంబంధించిన ఆస్తులను రీ సర్వే చేయించి స్థిర ఆస్తులు డిజిటలైజ్ చేయించి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం
• ఇమామ్, మౌజమ్ లకు రూ. 15 వేలు
• అన్ని అగ్రకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు
• కులం,వర్గం, ప్రాంతం లేని నవ సమాజం నిర్మిస్తాం
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తాం . వికేంద్రీకరణ పాలన జరిగేలా చూస్తాం
• రాజధానిని ఫ్రీజోన్ గా ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పి్స్తాం
• అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం
• సీపీఎస్ రద్దు చేస్తాం
• పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం
• అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 26 శాతం ఐఆర్ అమలు చేస్తాం

picturemessage jhyighh0.lwg

picturemessage qrapwdlz.fl5

Read Also: జ‌ర్న‌లిస్టు చెప్పులు మోసిన ప్రియాంక గాంధీ..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad