మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ హత్య విచారణకు సంబంధించి నాడు నియమించిన సిట్ బృందం ఆధారాలను సేకరించడంలో విఫలమైంది. దీంతో జగన్ ప్రభుత్వం కొత్త సిట్‌ను ఏర్పాటు చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రకాష్, వెంకట కృష్ణారెడ్డి ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. బెయిల్ కోరుతూ జడ్జీ ముందు ఉంచిన పిటిషన్‌ను డిస్మస్ చేస్తామని నిందితులకు తెలుగా, వారి తరుపు న్యాయవాది మాత్రం పిటిషన్‌ను ఉప సంహరించుకుంటామని జడ్జీకి విన్నవించారు. నిందితుల తరుపు న్యాయవాది వినతికి కోర్టు అంగీకరించింది. బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.