ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, YS వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నువ్వు హత్య చేశావ్.. అంటే నువ్వే హత్య చేశావ్ అంటూ అటు YCP ఇటు TDPలు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నరు. నిన్నటివరకు అభివృద్ది, ప్రత్యేకహోదా అంటూ సాగిన రాజకీయ విమర్శలు ఇప్పుడు హత్య రాజకీయాలపై చర్చగా మారాయి. వివేకానందరెడ్డిని YS కుటుంబ సభ్యులే హత్య చేసి మాపై నేడుతున్నారని AP సీఎం చంద్రబాబు గారు పదే పదే ప్రచారం చేస్తున్నాడు.
చంద్రబాబుగారు చేస్తున్న ఇలాంటి అసత్య ఆరోపణల వల్ల కేసు తప్పుదోవ పడుతుందని.. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని YS వివేకానందరెడ్డి కూతురు సునీత, AP సీఈవోని కలిసి ఫిర్యాదు చేశారు. కొందరు పెద్దలు కావాలనే సిట్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానంగా ఉందని.. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపేలా చూడాలని AP సీఈవో “గోపాల కృష్ణ ద్వివేది” గారిని కలిసి విజ్ఞప్తి చేశారు సునీత.
ఇదిలాఉంటే ఈరోజు “YS జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన “దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి”ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలో అతడికి కూడా సంబందం ఉందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో సిట్ విచారణ మరింత తప్పుదోవ పడుతుంది అని అభివించిన సునీతారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధానాధికారి “సునీల్ అరోరా”ను కలిశారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసు విచారణను ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని ఆమె కోరారు. రాష్ట్ర పోలీసులు చెప్పటిన సిట్ విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రావని… ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆమె విన్నవించారు.