Home Latest News క‌మ్మ కోటాలో మంత్రి ప‌ద‌వి : ఆ నేత‌కే క‌న్ఫామ్‌..!

క‌మ్మ కోటాలో మంత్రి ప‌ద‌వి : ఆ నేత‌కే క‌న్ఫామ్‌..!

ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నికల్లో వైసీపీ త‌న ప్ర‌ధాన ప్ర‌త్యర్ధి పార్టీ అయిన టీడీపీని కృష్ణా జిల్లాలో కోలుకోలేని దెబ్బ‌తీసిన సంగ‌తి తెలిసిందే. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, వాటిలో వైసీపీ 14 కైవ‌సం చేసుకోగా, టీడీపీ కేవ‌లం రెండింటికే ప‌రిమిత‌మైంది. దీంతో రాజ‌ధానిలో భాగ‌మైన బెజ‌వాడ ఉన్న ప్రాంతం కావ‌డంతో ఈ ప్రాంతం నుంచి మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది.

ఇలా కృష్ణా జిల్లాలో వైసీపీ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుపొంద‌డంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌డం క‌న్ఫామ్ అనే క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ముఖ్యంగా ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల్లో కొడాలి నాని, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ పేర్లు విన‌ప‌డుతున్నాయి.

ఈ ఇద్ద‌రు నేత‌ల్లో కొడాలి నాని వైసీపీ టికెట్‌పై వరుస‌గా మూడుసార్లు గెలుపొంద‌గా, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ వైసీపీ నుంచి పోటీచేసి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై విజ‌యం సాధించారు. అయితే ఈ ఇద్ద‌రిలోను కొడాలి నానికే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad