Home Latest News పోలీసులకే షాక్ ఇచ్చిన లేడి : యూట్యూబ్‌ వీడియో చూసి ఏంచేసిందో తెలిస్తే..!

పోలీసులకే షాక్ ఇచ్చిన లేడి : యూట్యూబ్‌ వీడియో చూసి ఏంచేసిందో తెలిస్తే..!

సోషల్ మీడియా అందులోనూ యూట్యూబ్‌ లో మనకు ఎలాంటి సంచారం కావాలన్న ఇట్టే దొరుకుతుంది. నిజానికి మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అంటే ఇంస్టూట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. చేతులో ఫోన్, అందులో డేటా ఉంటే చాలు ఇంట్లోనే కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇదేకాక ఏ వస్తునువు ఎలా ఆపరేట్ చేయాలి ? ఎలా తయారు చేయాలి ఇలా అన్నటికి సామదానం యూట్యూబ్‌ లో ఉంటుంది. ఇది ఒకరకంగా మంచిదే అయిన కొందరు మాత్రం యూట్యూబ్‌ వీడియోలను తప్పుడు పనులకు వాడుకుంటున్నారు.

అప్పుల బాధ నుండి బయటపడేందుకు ఓ మహిళ సరికొత్త ప్లాన్ వేసింది. ఎలాంటి కష్టం లేకుండా ఇంట్లోనే దొంగనోట్లు ముద్రిస్తూ అప్పులు తీర్చాలని ఆశపడింది. కానీ కథ అడ్డం తిరగడం తిరిగి చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళా చెప్పేది విని షాక్ అయ్యారు. మనుషులు ఇలా ఎలా ఆలోచిస్తారు ? అందులోనూ మహిళలు అంటూ తలలు పట్టుకున్నారు.

అసలు విషయానికివస్తే.. తమిళనాడులోని “కడలూరు” మరియప్పన్ నగర్‌ కు చెందిన “భరణి కుమారి” అనే మహిళకు ఆనంద్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంసారం అంతా బాగుంది అనుకుంటుండగా భర్త “ఆనంద్‌” కు వ్యాపారంలో నష్టాలు రావడంతో.. ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. దాంతో చేసేదిలేక బ్రతకడం కోసం “భరణి కుమారి” ఇరుగుపొరుగువారి దగ్గర అప్పులు చేసింది. కానీ వారికి తిరిగి ఎవ్వడానికి డబ్బు లేదు. అప్పు ఇచ్చినవారి నుండి ఒత్తిడి పెరగడంతో ఏంచేయాలో అర్థంకాలేదు. అప్పు ఎలాగైనా తీర్చాలని భావించిన ఆమెకు ఓ ఆలోచన వచ్చింది.

యూట్యూబ్‌ లో కొన్ని వీడియోలో చూసిన భరణి కుమారి.. దొంగనోట్లను ఎలా ముంద్రించాలో నేర్చుకుంది. అంతే వెంటనే తన ప్లాన్‌ను అమలరు పరిచింది. కలర్ ప్రింటర్ సాయంతో ఇంట్లోనే దాదాపు రూ. 1 లక్ష విలువ చేసే రూ.2వేలు, 500, 200ల నకిలీ నోట్లను ముద్రించింది. ఆ నోట్లను “కడలూరు”లో మారుస్తూ వచ్చింది. అలా ఈమద్య కడలూరులోని ఓ షాపులో ఫ్రూట్స్ కొనుగోలు చేసింది “భరణి కుమారి”. రూ.200 చెల్లించాల్సి ఉండగా చిల్లర లేదు అని రూ.2వేల నోటును ఇచ్చింది.

ఆమె ఇచ్చిన రూ.2వేల నోటు రంగు తేడాగా ఉండటంతో షాపులో ఉన్న మహిళకు అనుమానం వచ్చి భర్తకు చూపించింది. ఆ నోటు పరీక్షించిన అతడు అది దొంగనోటు అని గుర్తించాడు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వస్తున్నారు అని గ్రహించిన భరణి కుమారి ఏమి తెలియానట్లుగా దగ్గరలోని బస్టాండ్‌ కు వెళ్లి “చిదంబరం” వెళ్లే బస్సు ఎక్కి కుర్చింది. ఆమె కోసం గాలించిన పోలీసులు చివరికి బస్సులో ఉందని తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంట్లో ఉన్న నకిలీ నోట్లను, ప్రింటర్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad