Home Latest News కుటుంబాన్నంతా కాల్చేశాడు..!

కుటుంబాన్నంతా కాల్చేశాడు..!

ఈ రోజుల్లో కుటుంబంలో ఒకరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలనుకునే రోజులువి. ఇంట్లో తన తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి తనుకు రాలేదని, తనకన్నా చిన్నవాడు ఎదుగుతున్నాడని అక్కసుతో, కుటుంబాన్నంత కాల్చి బూడిద చేశాడు. తల్లి నుండి చిన్న పిల్లలవరకు కాటికి పంపాలని ఇంటి మొత్తానికి నిప్పంటించాడు. తన ఇంటికి నిప్పు పెట్టి రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరు తమ్ములను తానే చంపుకున్నాడు ఓ మూర్కుడు.

వివరాల్లోకి వెళ్తే..

పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని మల్దా జిల్లా మదన్తోలలో జరిగింది. వికాశ్ (32), మఖాన్ మోందల్(30), గోవిందా (28), లు ముగ్గురు అన్నదమ్ములు. వీరందరికి పెళ్లిళ్లు జరిగి, పిల్లలు కూడా ఉన్నారు. తల్లితో సహా కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కలిసుంటున్నారు. తన తండ్రి ఉద్యోగం వారసత్వపరంగా చదువులో అర్హత గల గోవిందాకు ప్రభుత్వ నియామకాల్లో ఉద్యోగం వచ్చింది. మఖాన్ కు రావలిసిన ఉద్యోగం తనకంటే చిన్నవాడైన తమ్ముడికి వారసత్వ ఉద్యోగం వచ్చిన విషయం తెలుసుకున్న మఖాన్ జీర్ణించుకోలేకపోయాడు.

మఖాన్ కోపంతో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా తన పెంకుటింటి పై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. అన్న వికాశ్, వికాశ్ భార్య వీరికి కొడుకు కూతురున్నారు. తమ్ముడు గోవిందా, గోవిందా భార్య , వీరికి ఇద్దరు కూతుళ్లు కలరు. ఈ ఘటనలో తమ్ముడు గోవిందా, గోవిందా ఇద్దరు కూతుళ్లు, అన్న వికాశ్ మరణించారు. వికాశ్ భార్య, కొడుకు, కూతురు, గోవిందా భార్య మల్దా ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జరిగిన తన తల్లి మరో గదిలో ఉండటంతో, మఖాన్ భార్య తన పుట్టింటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడగలిగారు. ఈ ఘటన పై మానిక్చక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad