Home Latest News నగ్నంగా ఉంటేనే న‌ట‌న‌లో శిక్ష‌ణ‌..! ఇంత‌కీ ఆ స్వీటీ ఏం చెప్పింది..?

నగ్నంగా ఉంటేనే న‌ట‌న‌లో శిక్ష‌ణ‌..! ఇంత‌కీ ఆ స్వీటీ ఏం చెప్పింది..?

హైద‌రాబాద్‌లోని సూత్ర‌ధార ఇనిస్టిట్యూట్ న‌గ‌రం న‌డిబొడ్డున హిమాయ‌త్ న‌గ‌ర్‌లో గ‌త 20 ఏళ్లుగా ఉంది. దీనికి డైరెక్ట‌ర్‌గా ప్ర‌ముఖ న‌టుడు, శిక్ష‌కుడు విన‌య్ వ‌ర్మ‌. విన‌య్ వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో యాక్టింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కొన‌సాగుతోంది. ఈ ఇనిస్టిట్యూట్‌లోనే ఎంద‌రో ప్ర‌ముఖ న‌టులు ట్రైనింగ్ తీసుకున్న‌ట్టు విన‌య్ వ‌ర్మ చెబుతున్నారు.

విన‌య్ వ‌ర్మ‌కు ప‌లు చిత్రాల్లో ముఖ్యపాత్ర‌లు పోషించిన అనుభవం ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.ఎన్నో సినిమాల్లో న‌టించిన అనుభ‌వం ఉన్న విన‌య్ వ‌ర్మను చూసి కొంద‌రు యువ‌తీ యువ‌కులు ఇక్క‌డ ట్రైన‌ప్ అయ్యేందుకు వ‌స్తుంటారు. త‌న‌కు ఉన్న నేమ్ అండ్ ఫేమ్‌ను అడ్డుపెట్టుకుని విన‌య్ వ‌ర్మ చేస్తున్న ఆగ‌డాలు నిద‌ర్శ‌నంగా ఓ ఇష్యూ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అమ్మాయిల‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పటి వ‌ర‌కు విన‌య్ వ‌ర్మ‌పై ఎవ్వ‌రూ పెద్ద‌గా కంప్లైంట్ చెయ్య‌లేదు. కానీ, ఒక అమ్మాయి మాత్రం ధైర్యంగా వ‌చ్చి ఇక్క‌డ జరుగుతున్న భాగోతం బ‌య‌ట‌ప‌డేలా చేసింది.

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో నివ‌సించే స్వీటి అనే యువ‌తి మాస్ క‌మ్యునికేష‌న్స్ చ‌దువుకుంది. ఈమెకు స్టేజ్ ఫియ‌ర్ చాలా ఎక్కువ‌. ఇలాంటి స్టేజ్ ఫియ‌ర్ పోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా యాక్టింగ్‌లో ట్రైన‌ప్ కావాల‌ని కొంద‌రు సూచించారు.

దీంతో ఆమె కూడా ఎన్‌క్వౌరీ చేసింది. యాక్టింగ్‌లో ట్రైన‌ప్ అయితే స్టేజ్ ఫియ‌ర్ పోతుంద‌ని తెలుసుకుంది.
ఇందు కోసం ఒక మాంచి ఇనిస్టిట్యూట్ కావాల‌ని హైద‌రాబాద్ అంతా వెతికింది. ఈమెకు హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో ఉన్న సూత్ర‌ధార అనే న‌ట‌నా శిక్ష‌ణా సంస్థ ఉన్న‌ట్టుగా తెలుస్తుంది.

విన‌య్ వ‌ర్మ‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరు ఉన్న‌ట్టు గుర్తించింది. ఇదే ఇనిస్టిట్యూట్‌లో అత్య‌ధిక పారితోషికాలు ఇవ్వాల్సి ఉంద‌ని కూడా తెలుసుకుంది. త‌న‌కైతే స్టేజ్ ఫియర్ పోవాల‌ని భావించిన ఈ యువ‌తి విన‌య్ వ‌ర్మ ట్రైనింగ్ సెంట‌ర్‌లో చేరింది. త‌న‌కు నేర్పించిన‌వ‌న్నీ నేర్చుకుంది. నాలుగురోజుల క్రితం ఓ అనుకోని ఆప‌ద ఎదురైంది.

అదేమిటంటే.. యువ‌తీ యువ‌కుల‌ను ఒకే గ‌దిలోపెట్టి త‌లుపులు వేశారు. వాళ్లంద‌ర్నీ విన‌య్ వ‌ర్మ బ‌ట్ట‌లు విప్పేయాల్సిందిగా సూచించాడు. దీంతో స్వీటికి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. బ‌ట్ట‌లు విప్ప‌డానికి యాక్టింగ్ ఉన్న సంబంధం ఏంటో తెలీయ బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంది.

న‌టించ‌డానికి బ‌ట్ట‌లు ఎందుకు విప్పాల‌ని, అబ్బాయిల‌కు అనుమాన‌మేసింది..? న‌ట‌న‌లో రాటుదేలాలంటే త‌ప్ప‌నిస‌రి అని చెప్పారు. అంతేకాకుండా, అంద‌రూ న్యూడ్‌గా త‌న‌ముందు నిల్చోవాల‌ని ట్రైన‌ర్ విన‌య్ వ‌ర్మ హుకుం జారీ చేశాడు. ఆడ‌, మ‌గ తేడా లేకుండా అంద‌రూ ఇలానే చేయాలంటాడు.

ఆ రూములో అబ్బాయిలు ఉన్నారు కాబ‌ట్టి, తాము బ‌ట్ట‌లు విప్ప‌లేమని స్వీటీతోపాటు ఉన్న ఆడ పిల్ల‌లు కూడా గొల్లుమ‌న్నారు. అందుకు విన‌య్ వ‌ర్మ స‌సేమిరా అన్నారు. అందుకు స‌మాధానంగా న‌గ్నంగా శిక్ష‌ణ తీసుకుంటేనే న‌ట‌న‌లో పీక్ స్టేజ్‌కు వెళ‌తార‌ని తెగేసి చెప్పాడు. ఇందుకు స్వీటి స‌సేమిరా అంది. దీంతో స్వీటిని విన‌య్ వ‌ర్మ నానా తిట్లు తిట్టాడు.

దాంతో స్వీటి ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. త‌న తండ్రికి జ‌రిగిన విష‌య‌మంతా చెప్పేసింది. స్వీటి తండ్రి నేరుగా వెళ్లి విన‌య్ వర్మ‌ను నిల‌దీశాడు. అయితే, త‌మ ట్రైనింగ్‌లో స‌హ‌జ‌మ‌ని, దీనికి ఇంత రాద్దాంతం చేయ‌డ‌మేంట‌ని విన‌య్ వ‌ర్మ ప్ర‌శ్నిస్తున్నాడు.

విన‌య్ వ‌ర్మ అంత క‌రుగ్గా మాట్లాడేస‌రికి స్వీటి షీ టీమ్స్‌ను ఆశ్ర‌యించింది. వారు నారాయ‌ణ‌గూడ పోలీసుల‌ను క‌ల‌వ‌మ‌ని చెప్పారు. స్వీటి కుటుంబం దిక్కు తోచ‌ని స్థితిలో నారాయ‌ణ‌గూడ పోలీసుల‌ను క‌లుసుకున్నారు. బాధితులు చివ‌ర‌గా మీడియాను ఆశ్ర‌యించారు. ఇదిలా ఉంటే విన‌య్ వ‌ర్మ చేసిన కామెంట్ల‌పై మ‌హిళా సంఘాలు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. తానేత‌ప్పూ చేయ‌లేద‌ని అత‌ను ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా స‌మాధానం చెప్ప‌డంపై మండిప‌డుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad