ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే యువత రాజకీయాల్లోకి రాగలుగుతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యంత్రిని చేసేందుకు ఏపీ యువత నడుం బిగించారని, యువ శక్తి ముందు ఏ ఫ్యాన్ గాలీ టీడీపీని ఏం చేయలేదంటూ ఏపీ ప్రతిపక్షం వైసీపీని ఉద్దేశించి సెటైర్స్ పేల్చారు.
ఇవాళ శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. యువత సిగ్గుపడేలా వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారని, జగన్‌కు సహకరించేందుకు యువత సిద్ధంగా లేరని, జగన్‌కు యువత సహకరిస్తే ఏపీలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తుతాయన్నారు. టీడీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు యువతపై ఉందన్నారు. షల్ మీడియాలో ప్రచారాన్ని విస్తృతం చేయాలన్నారు. వాట్సాప్‌లలో పసుపు రంగుతప్ప మరో రంగు కనిపించకూడదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీని పదికి పది స్థానాల్లో గెలిపించే బాధ్యతను యువత తీసుకోవాలన్నారు.