ఈ నెల 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కిల్లి కృపారాణి తెలిపారు. కాగా, కాసేపటి క్రితం లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో కిల్లి కృపారాణి సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వీరి భేటీ జరిగింది. భేటీ అనంతరం కిల్లి కృపారాణి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సిద్ధాంతాల ప్రకారం కాంగ్రెస్‌లో తనకున్న పదవులన్నిటికి రాజీనామా చేసి, ఈ నెల 28న వైసీపలో చేరనున్నట్లు తెలిపారు.
అయితే, ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రాజకీయ ముఖ్య నేతల వలసలు జోరందుకున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చేరికతో పాటు. తాజాగా, మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించడంతో వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్‌ను నింపింది.