Home Latest News తండ్రిని చంపిన కూతురు : ఏ శిక్ష వేయాలో తేల్చుకోలేని పోలీసులు

తండ్రిని చంపిన కూతురు : ఏ శిక్ష వేయాలో తేల్చుకోలేని పోలీసులు

తండ్రిని చంపిన కూతురు.. ఇలాంటి వార్తలు చాలా అరుదుగా వింటుంటాం. నిజానికి ఏ కూతురు తల్లిదండ్రులను చంపుకోదు.. కానీ కొందరు మాత్రం డబ్బు కోసమో, ఆస్తి కోసమో తల్లిదండ్రులను చంపిన ఘటనలను అప్పుడప్పుడు చూసే ఉంటారు. కానీ ఇక్కడ ఈ కూతురు మాత్రం తన తండ్రిని క్షణికావేశంలో చంపేసింది. తన తల్లిని వేధించి, మానసికంగా హింశిస్తున్నాడన్నా కోపంలో తండ్రిని హత్య చేసింది ఓ కూతురు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం, కంచెరపాలెంలోని రవీంద్రనగర్ నివాసం ఉండే కోడ సముద్రయ్య(48) రైల్వే ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమంలో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఒక మహిళాతో అక్రమ సంబందం పెట్టుకున్నాడు సముద్రయ్య. అక్కడితో ఆగకుండా ఈమద్య ఏకంగా ఆమెను ఇంటికెతీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆరోజు నుండి ప్రతిరోజూ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దీంతో అతడి భార్య నాగలక్ష్మి నరకం అనుభవిస్తుంది. ఆ కోపంలో సముద్రయ్యను నిలదీసిన పాపానికి ఆమెపై చేసుకున్నాడు.

ఎంత చెప్పిన వినకపోవడంతో అతడి కూతురు బిబాషాకు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ఈ గురవారం తన తండ్రితో పాటు అతడు అక్రమ సంబందం పెట్టుకున్న మహిళపై కత్తితో దాడి చేసింది బిబాషా. ఈ దాడిలో ఆమె తండ్రి సముద్రయ్య అక్కడికక్కడే మరణించగా.. మహిళా మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

కంచరపాలెం సీఐ “భవాని ప్రసాద్‌” సంఘటన స్థలానికి చేరుకొని బిబాషాతో పాటు ఆమె తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే హత్య బిబాషాకు ఏ శిక్ష వేయాలో తేల్చుకోలేక పోతున్నారు పోలీసులు. ఎందుకంటే ఆమె తండ్రి చేసింది అతిపెద్ద తప్పు.. అంతమాత్రాన చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్య చేయడం కూడా నేరమే కదా అంటున్నారు పోలీసులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad