Home Latest News విలనిజం చూపించిన సిమ్రాన్..!

విలనిజం చూపించిన సిమ్రాన్..!

‘ఒరేయ్ నేను చీరకట్టిన మగాడినిరా’ అంటూ సిమ్రాన్ విలనిజాన్ని చూపింది. ఆమెను ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా, చూసినవారంతా ఈ డైలాగ్ వింటే ఈమెలో ఇంత విలనిజముందా అని ముక్కున వేలేసుకున్నారు. సిమ్రాన్ ఇప్పటి వరకు నటించిన పాత్రలన్నింటికి బిన్నంగా ఓ రేంజ్ లో ‘సీమరాజా’ నటించిందిఅనడానికి ఈ డైలాగే సాక్ష్యం.

‘సీమరాజా’ తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. అక్కడ భారీ వసూళ్లను సంపాదించి పెట్టింది. అందుకీ తెలుగులో కూడా విడుదల చేయుటకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నెల 8వ తేదీన విడుదలచేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన సమంత, కీర్తి సురేశ్ కి తెలుగు వారిలో మంచి ఫాలోయింగ్ ఉండటం చేత టాలీవుడ్ లో విడుదల చేస్తున్నట్లు శివ కార్తికేయన్ చెప్పాడు.

ఈ సినిమాకి పోన్ రామన్ దర్శకత్వంతో, సాయి కృష్ణ నిర్మాణముతో రూపుదిద్దుకున్నా , ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించగా, శివకార్తికేయన్ సరసన సమంత, కీర్తి సురేశ్ కథానాయికలుగా నటించారు. సమంత ఈ సినిమాలో కర్ర పట్టుకుని చేడుగూడదుకోనుంది. సమంత సినిమా కోసం ప్రత్యేకంగా కర్రసాము నేర్చుకుంది. సమంత, కీర్తి సురేశ్ తీరు సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి.

ఇక సిమ్రాన్ విషయానికొస్తే లేడీ విలన్ గా సినిమా లో నటించింది. ఆమె విలనిజం తెరపైనే చూడాలట. సిమ్రాన్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలువనుంది. తమిళ ఫ్లేవర్ కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారట. తెలుగు రాష్ట్రాల్లో మొత్తముగా 400 థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad