వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విమర్శలను సంధించారు. గత ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ ఏపీలో ఉన్న దోమలు మగవా..? ఆడవా..? అని తెలుసుకోవడానికే సమయం కేటాయించిందని, అందుకోసం ఏకంగా రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టారంటూ ట్వీట్టర్ వేదికగా పోస్టులు చేశారు. ఇటువంటి ఆలోచన ఒక్క టీడీపీకే వస్తాయంటూ ఆ పార్టీ నేతలపై విడ్డూరాలతో విరుచుకుపడ్డారు.
విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 29, 2019