టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో కొనసాగిన ఆయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సీటు కేటాయించనందున ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీలో చేరినా ఆయన్ను ఎమ్మెల్యే సీటు వరించకపోగా, పార్టీసైతం ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
ఇదిలా ఉండగా, వంగవీటి రాధా తాజాగా తీసుకున్న నిర్ణయం ఏమిటి..? టీడీపీ ఎంపీల మాదిరిగానే ఈయన కూడా పార్టీని వీడనున్నారా..? అన్న ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో రాధా భేటీ అయిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాజకీయ విశ్లేషకుల వాదనకు గట్టి బలం చేకూరినట్టయింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వంగవీటి రాధా ఈ నెల 25న లేదా 26న జనసేనలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.