Home Latest News రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, విద్యా, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న రిజ‌ర్వేష‌న్‌ల పెంపు నిర్ణ‌యంతో లబ్ది చేకూరనుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం 50-60 శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్ర‌భుత్వం చేసిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ ప్ర‌కారం ఏడాదికి 8లక్షల రూపాయల ఆదాయం కంటే తక్కువ ఉన్నవారే అర్హులు. ఐదు ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న వారే ఈ రిజర్వేషన్లకు అర్హులు. 1,000 చ. అడుగుల కంటే ఇంటి స్థలం ఉంటే రిజర్వేషన్ల కు అర్హులు. మరి కొన్ని నెలల్లో జ‌ర‌గ‌నున్న లోక్ సభ ఎన్నికలను దృష్టి లో పెట్టుకునే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అగ్రవర్ణాల ఓట‌ర్ల‌ను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నం గా తేట‌తెల్ల‌మ‌వుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, రేపు లోక్ సభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad