Home Latest News వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా చేయాల్సిన మొద‌టి ప‌ని ఇదే..!

వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా చేయాల్సిన మొద‌టి ప‌ని ఇదే..!

ఏప్రిల్ 11 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి మే 23న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము 100 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతామ‌ని ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇటీవ‌ల వెలువ‌డిన ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వే ఫ‌లితాలు సైతం వైసీపీకే ప్ర‌భుత్వ ఏర్పాటు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని స్ప‌ష్టం చేశాయి. స‌ర్వే లెక్క‌లు చెప్పిన‌ట్టు వైసీపీ అధికారం చేప‌ట్టి, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన వెంట‌నే ముఖ్యంగా చేయాల్సిన కొన్ని ప‌నులను రాజ‌కీయ విశ్లేష‌కులు త‌మ‌దైన శైలిలో చెప్పుకొస్తున్నారు.

1) ఇవాళ ఏపీలో వంద‌కు 70 శాతం మందికి సొంత ఇళ్లులు లేవు. ఆ 70 శాతం మందిలో దాదాపు 40 శాతం మంది క‌ఠిక పేద‌రికాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు. అంటే రోజుకు మూడు పూట‌లా తిన‌డానికి తిండి లేన‌టువంటి పేద‌ల‌న్న‌మాట‌.

అటువంటి పేద‌వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఏపీలో ప‌ది ల‌క్ష‌ల ఇళ్ల‌ను మంజూరు చేస్తే అవి నిర్మాణ‌నానికి నోచుకోలేదు. వాటికి రాజ‌కీయ కార‌ణాలు కావొచ్చు., కాంట్రాక్ట‌ర్లు దొర‌క్క కావొచ్చు., ఇళ్ల నిర్మాణానికి స‌రైన‌ స్థ‌లాలు కేటాయించ‌లేక‌పోవ‌డం కావొచ్చు., రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కావొచ్చు., ఏది ఏమైనా ఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్మించ‌ద‌ల‌చిన ప‌ది ల‌క్ష‌ల ఇళ్లు నిర్మాణానికి మంజూరు కాలేదు.

అయితే, ప్ర‌స్తుతం ఏపీలో ఆ 40 శాతం మంది ప్ర‌జ‌ల సంపాద‌నలో దాదాపు 50 శాతం ఇళ్ల అద్దె క‌ట్ట‌డానికే వెచ్చించాల్సిన ప‌రిస్థితి. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి నోచుకోవాలంటే వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే దృష్టి పెట్టాల్సి ఉంది. అవ‌స‌మైతే, కేంద్ర ప్ర‌భుత్వంతో మ‌రోమారు మాట్లాడి, ఆ ప‌ది ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణానికి కృషి చేయాల‌ని రాజకీయ విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad