Home Latest News పులివెందుల ప్ర‌జ‌లకు వైస్ జ‌గ‌న్ తొలి హామీ ఇదే..!

పులివెందుల ప్ర‌జ‌లకు వైస్ జ‌గ‌న్ తొలి హామీ ఇదే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రికొద్ది సేప‌ట్లో పులివెందుల ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. అందులో భాగంగా వైసీపీ త‌రుపున ఏపీ వ్యాప్తంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేసిన జ‌గ‌న్ వాటిని ముగించుకుని నేడు పులివెందుల‌కు చేరుకున్నారు.

జ‌గ‌న్ నామినేష‌న్ సంద‌ర్భంగా పులివెందుల‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు.. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో ఏపీ ప్రాజెక్టుల‌న్నీ న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయ‌న్నారు. సున్నా వ‌డ్డీ ప‌థ‌కాన్ని గాలికొదిలేశార‌న్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు పసుపు – కుంకుమ పేరుతో డ్రామాలు ఆడుతున్నార‌న్నారు.

పులివెందుల ప్ర‌జ‌లను ఉద్దేశించి వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ క‌డ‌ప గ‌డ్డ‌పై పుట్టినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. క‌ష్టంలో ఉన్నా కూడా గుండె ధైర్యంతో ఎలా ఉండాలో నేర్పింద‌న్నారు. ఎదుటి వ్య‌క్తులు ఎవ‌రైనా మ‌నం మంచి చేస్తున్నామా..? లేదా..? అన్న‌దే ముఖ్య‌మ‌న్నారు.

రాతి నేల‌లో సేద్యం ఎలా చేయాలో నేర్పింది పులివెందుల నేల‌.. పులివెందుల ప్ర‌జ‌ల‌కు ప‌ది మందికి సాయం చేయ‌డ‌మే తెలుసు.. చంద్ర‌బాబు పాల‌న‌లో ఎన్నో అన్యాయాలు.. మోసాలు చూశాం.. చంద్ర‌బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నార‌న్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే ముందుగా పులివెందుల చుట్టూరా రింగ్‌రోడ్డును ఏర్పాటు చేస్తామ‌ని, అలాగే అండర్ డ్రైనేజీ సిస్ట‌మ్ తీసుకొస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ప్ర‌స్తుతం పులివెందుల‌లో ఉన్న ట్రిపుల్ ఐటీ, ప‌శు ప‌రిశోధనా కేంద్రంను దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఏర్పాటు అయిన‌వేన‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad