ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార జోరును మరింత పెంచారు. ఎక్కడికక్కడ విపక్షాన్ని ఎండగడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్, కేసీఆర్, మోడీ కుట్రలను ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు ప్రచార వేడిని పెంచుతున్నారు. తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపుతున్నారు. మంగళవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ఇవాళ ఆత్మకూరు, ఉదయగిరి, కనిగిరి, వినుకొండ, నరసారావుపేటలోని రోడ్ షోలో, బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
కాగా, మంగళవారం నాడు తిరుపతిలో నిర్వహించిన ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉంది కాబ్టటే తిరుపతి మొబైల్ హబ్ అయిందన్నారు. వైఎస్ జగన్‌ను చూసిన వారంతా పెట్టబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రారన్నారు. ఇప్పటికే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను జగన్ జైలుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు.