Home Latest News ఇచ్చట జగన్ మీద దాడి చేసిన వాళ్ళకి మర్యాదలు చేయబడును..!

ఇచ్చట జగన్ మీద దాడి చేసిన వాళ్ళకి మర్యాదలు చేయబడును..!

మామూలుగా చిన్న చిన్న వాళ్ళని మర్డర్ చేస్తే పెద్ద శిక్షలే వేస్తారు. అదే పెద్ద వాళ్ళని మర్డర్ చేస్తే….మర్డర్ అటెంప్ట్ చేస్తే….చేసినోడికి సెలబ్రిటీ హోదా వస్తుంది. ప్రస్తుతం జగన్ మీద హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ పరిస్థితి ఇలానే ఉంది. పబ్లిసిటీతో పాటు సెలబ్రిటీ హోదా వచ్చేసింది. చేసిన ఎదవ పనికి జైల్లో వీపీలా చూడాల్సిందిపోయి వీఐపీలా ట్రీట్ చేస్తున్నారు. ఏంటో ఈ మాయదారి చట్టాలు. ముప్పూటలా ముద్ద పెట్టి కోడిపుంజును మేపినట్టు మేపుతున్నారు.

‘మా నాయనే, జగన్ కి కత్తి బాగా దింపావ్’ అని చెప్పి బాబుగారికి మూడు పూటలా బిర్యానీ పెట్టి దొరబాబులా చూసుకుంటున్నారు. మిగతా ఖైదీల మాదిరి జైల్లో అధికారులు చెప్పే పనులు చేయాల్సిన అవసరం లేదట. అక్కడిదాకా ఎందుకు? అసలు దొరబాబు గారి గదిని దొరబాబు గారే శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముగ్గురు అసిస్టెంట్ లని నియమించారట. వాళ్ళు కాళ్లే పడతారో, స్నానానికి వేన్నీళ్లే పెడతారో ఎవరికి తెలుసు? ఇక శ్రీనివాస్ తో మాట్లాడేందుకు ఏ ఖైదీకీ వీలు లేకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారట.

అతని కోసం పెట్టిన అసిస్టెంట్ లు కూడా తెలుగు వచ్చిన వాళ్ళు కాదు. బీహార్, ఒడిస్సాలకు చెందిన వాళ్ళు. భాయ్, జలీల్, మిథున్ లను శ్రీనివాస్ వ్యక్తిగత సహాయకులుగా కేటాయించారట. ఎందుకంటే, జగన్ పై హత్యాయత్నం వెనకున్న సూత్రదారులు, పాత్రదారుల గురించి నిందితుడు పొరపాటున నోరు జారితే కష్టమన్న ఉద్దేశంతోనే తెలుగు వచ్చిన ఖైదీలెవరినీ నిందితుడి దగ్గరకు రానీయడం లేదట. శ్రీనివాస్ బాధ్యతలను డిప్యూటీ సూపరెండెంట్ స్ధాయి అధికారికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారని సమాచారం.

“నువ్వు ఏ పనీ చేయకు బాబు, జగన్ కి నెక్స్ట్ స్పాట్ ఎలా పెట్టాలో అది మాత్రమే ఆలోచించు” అన్నట్టు ఉంది. ఇవి శిక్షలా? ముప్పూటలా కోడిపుంజును మేపినట్టు మేపుతున్నారు. ఇంకా ఎన్ని మర్యాదలు చేయాలో అన్ని మర్యాదలు చేస్తున్నారు. ఈ చిత్ర విచిత్రాలన్నీ మన జైళ్లలోనే జరుగుతాయి. మొత్తానికి జగన్ మీద కోడి కత్తి దింపినందుకు గాను దొరబాబు గారికి రాచమర్యాదలు అందుతున్నాయి.

క్యాంటీన్ లో పని చేసినప్పుడు కూడా ఇన్ని సదుపాయాలు ఉండి ఉండవు. రోజూ బిర్యానీ, ముగ్గురు అసిస్టెంట్ లు, నిత్యం సెక్యూరిటీ. అబ్బా, ఎంత మంచి లైఫండి. తప్పు చేస్తే శిక్ష వేయాల్సింది పోయి పండక్కొచ్చిన కొత్త అల్లుడ్ని చూసినట్టు చూస్తున్నారు. ఇదే మర్డర్ అటెంప్ట్ ఏ చిన్న వ్యక్తి మీదో చేసి ఉంటే అతన్ని ఇలా చూస్తారా? ఈ పాటికి లోపలేసి చితక్కొట్టేసేవారు. తప్పులు పెద్ద వాళ్ళ మీద చిన్న వాళ్ళు చేసినా, పెద్దవాళ్లే చేసినా వీపీలా చూడాల్సిన చట్టమే వీఐపీల్లా ట్రీట్ చేయడమే ఏం బాలేదు. మనదేశంలో జైళ్ళంటే ఫుడ్ పెట్టే హాస్టల్స్ అయిపోయాయి.

ప్రతీ ఒక్కరినీ చేర్చుకుని సేవలు చేసే ఓల్డేజ్ హోమ్ ల్లా తయారయ్యాయి. ఇలా ఐతే దేశం ఏం బాగుపడుతుంది. తప్పు చేసిన వాడు చిన్నోడయినా, పెద్దోడైనా, ఎలాంటోడైనా సరే పట్టుకుని శిక్షించాల్సిందే. అదే చట్టం. ‘చట్టం ఎవరికీ కాదు చుట్టం’ అని చెప్పినప్పుడే దేశం బాగుంటుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad