Home Latest News అఖిలప్రియకు ఏమీ తెలీదు : హోంమంత్రి చినరాజప్ప

అఖిలప్రియకు ఏమీ తెలీదు : హోంమంత్రి చినరాజప్ప

ఆళ్లగడ్డలో కార్డన్ సర్చ్ పేరుతో త‌న అనుచ‌రుల ఇళ్లపై పోలీసులు దాడులు చేస్తూ వారిని వేధిస్తున్నార‌ని ఆరోపణ చేస్తూ ఏపీ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం త‌న‌కు ర‌క్ష‌ణంగా నియ‌మించిన గ‌న్‌మెన్‌ల‌ను సైతం వెన‌క్కు పంపించేసింది. అయితే . తాజాగా కర్నూలు జిల్లా పోలీస్ తీరును నిరసిస్తూ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా గన్ మెన్లను తిరస్కరించారు. తనుకూడా సోదరి అఖిలప్రియ బాటలోనే వెళ్తానని ప్రకటించేశారు.

ఇలా అఖిల‌ప్రియ‌, బ్ర‌హ్మానంద‌రెడ్డి గ‌న్‌మెన్ల‌ను వెన‌క్కు పంప‌డంపై ఇవాళ ఏపీ హోమంత్రి చిన‌రాజ‌ప్ప స్పందించారు. మంత్రి అఖిలప్రియకు ఏమీ తెలియదని, ఆమె తెలుసుకోవాల్సింది చాలానే ఉంద‌న్నారు. ఏదైన సమస్యలు వ‌స్తే వెంట‌నే ప్ర‌భుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చి ప‌రిష్క‌రించుకోవ‌లేకానీ, అలా అర్థ‌ర‌హితంగా గ‌న్‌మెన్‌ల‌ను వెన‌క్కు పంప‌డం స‌రైంది కాద‌న్నారు. అఖిలప్రియ ఇలా చేయడం తగదన్నారు. అఖిల ప్రియ‌, బ్ర‌హ్మానంద‌రెడ్డిలు ప్ర‌వ‌ర్తించిన తీరు అనాలోచిత‌మ‌ని, ఆ విష‌యం ముఖ్య‌మంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందని హోంమంత్రి చిన‌రాజ‌ప్ప తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad