టీడీపీని వీడే ప్రసక్తే లేదని, ఎవరు పార్టీ మారినా తాను మాత్రం సైకిల్ దిగేది లేదని కాకినాడ ఎంపీ తోట నర్సింహం మరోసారి స్పష్టం చేశారు. కాగా, ఇవాళ ఎంపీ తోట నర్సింహం మీడియాతో మాట్లాడుతూ తాను తనకు జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించాలని చంద్రాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే, తనకు ఆరోగ్యం బాగోలేనందున తన బదులు, తన భార్యకు సీటు కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాని తెలిపారు.
తన విజ్ఞప్తికి స్పందించిన సీఎం చంద్రబాబు ఆలోచించి నిర్ణయాన్ని చెప్తానన్నారని తోట నర్సింహం మీడియాతో తెలిపారు. ఇక, ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేతలను ఉద్దేశించి తోట నరసింహం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు టీడీపీన వారంతా వారి వారి వ్యక్తిగత స్వార్ధం కోసం వెళ్లారని, వారిని ప్రజలే ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారన్నారు.